ఆ మూడు జిల్లాలలో వైసీపీకి భారీ షాక్ తప్పదా.. అసలేం జరిగిందంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ప్రతి జిల్లాలోని సీట్లు కీలకమనే సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంలో రాయలసీమ జిల్లాలు కీలక పాత్ర పోషించాయి. రాయలసీమ జిల్లాలలో మొత్తం 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఈ అసెంబ్లీ నియోజకవర్గాలలోని 49 అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ ఘన విజయం సాధించింది. కడప, కర్నూలు జిల్లాలలో అయితే టీడీపీ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు.

ఉత్తరాంధ్ర జిల్లాలలో కూడా వైసీపీ సత్తా చాటడం గమనార్హం. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం వైసీపీకి ఉత్తరాంధ్రలో అనుకూల ఫలితాలు రావడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి విశాఖపట్నంలలో వైసీపీకి భారీ షాక్ తగలడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు కారణమని తెలుస్తోంది.

గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాలలో మొత్తం 34 సీట్లు ఉండగా 30 స్థానాలలో వైసీపీ విజయం సాధిస్తే కేవలం 4 స్థానాలలో మాత్రమే టీడీపీ విజయం సాధించడం గమనార్హం. 2024 ఎన్నికల్లో మొత్తం 34 నియోజకవర్గాలలో ఏకంగా 20కు పైగా సీట్లలో టీడీపీ గెలిచే ఛాన్స్ అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజలను ఆకట్టుకోవాలనే ఆలోచనతోనే జగన్ విశాఖను రాజదాని చేయడానికి ఆసక్తి చూపారు.

అయితే ఈ నిర్ణయం అమలు ఆలస్యం కావడం, జగన్ పాలనలో ఉత్తరాంధ్రలో చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి జరగకపోవడం కూడా ఆ పార్టీకి మైనస్ అయిందని చాలామంది భావిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో ఏ పార్టీ సత్తా చాటితే ఆ పార్టీనే అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీకి 100 ఎమ్మెల్యే సీట్లు కూడా రావడం కష్టమేనని చెప్పవచ్చు.