ఆదిలాబాద్ కలెక్టర్ దివ్య నిర్ణయానికి అనూహ్య మద్దతు

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్   ఇచ్చిన పిలుపుకు స్పందన లభించింది. ఆమె ఇచ్చిన ఒక్క పిలుపుతో అధికారులు, మానవతా వాదులు కదిలొచ్చారు. అభాగ్యులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.

కొత్త సంవత్సరం సందర్బంగా తన వద్దకు వచ్చే వారు బొకేలు, ఫ్లవర్లు తీసుకురావద్దని వాటి స్థానంలో బ్లాంకెట్లు, స్వెట్టర్లు తీసుకురావాలని  ఆమె అధికారులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. వాటిని నైట్ షెల్టర్లలో ఉన్నవారికి ఇచ్చి వారిని ఆదుకోవచ్చన్నారు. కలెక్టర్ దివ్య దేవరాజన్ ఇచ్చిన పిలుపుతో ఆమెకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన అధికారులు, నాయకులు, ప్రజలు స్వెట్టర్లు, రగ్గులు తీసుకొచ్చారు. అవి అన్ని కలిపి 500 వరకు అయ్యాయి. మరి కొంత మంది కూడా ముందుకు వచ్చి సహాయం చేయాలని  ఆమె అన్నారు. కలెక్టర్ కు అంతా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా మానవతా ధృక్పథంతో ఆలోచించిన కలెక్టర్ ను అంతా అభినందించారు. 

కలెక్టర్ పిలుపుతో సహాయం చేస్తున్న అధికారులు

ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉంది. చాలా మంది ఇళ్లు లేని వారు రోడ్ల మీదే రాత్రిళ్లు పడుకుంటున్నారు. చలి తీవ్రతతో వారు అనారోగ్యానికి గురవుతున్నారు.  దీనిని గమనించిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ వారికి ప్రభుత్వం తరపున నైట్ షెల్టర్లు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యమైన పట్టణాల్లో వీటిని ఏర్పాటు చేశారు. నైట్ షెల్టర్లలో ఇళ్లు లేని వారికి రాత్రి పూట ఆశ్రయం కల్పిస్తున్నారు. వారికి చలి నుంచి రక్షణ పొందేందుకు అవసరమైన వస్తువులు లేవు. దీంతో వారికి ప్రభుత్వం తరపున సహాయం చేశారు. మరి కొంత మందికి కూడా సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో దివ్య దేవరాజన్ ఈ పిలుపునిచ్చారు. ఆమె ఇచ్చిన పిలుపుతో చాలా మంది స్పందించి రగ్గులు, స్వెట్లర్లు అందించారు. 

దివ్య దేవరాజన్ స్వస్థలం తమిళనాడు రాజధాని  చైన్నై. ఆమె విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే సాగింది. ఆమె చెన్నై బిట్స్ పిలానిలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అందులో నుంచే పీజీ చేశారు.  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, రైల్వే అకౌంట్స్ ఆఫీసర్ గా కూడా ఆమె పనిచేశారు. ప్రజలకు సేవ చేయాలనే తపన దివ్యలో బాగా ఉంటుంది.  అందుకే ఎక్కువ మంది ప్రజలకు సేవా చేయాలంటే సివిల్స్ సాధించాలనే లక్ష్యం పెట్టుకుంది దివ్య. అలా తన ప్రణాళిక వేసుకుని సివిల్స్  ప్రిపరేషన్ కోసం  చైన్నై నుంచి ఢిల్లీ వెళ్లింది. అలా సివిల్స్ కోసం కోచింగ్ తీసుకుంటూ 2009 లో రాసిన సివిల్స్ పరీక్షలో ఆల్ ఇండియా స్థాయిలో 37 వ ర్యాంకు సాధించింది.  2010 లో ఐఎఎస్ ట్రైనింగ్ ముగిశాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను తన సర్వీసులో ఎంచుకుంది. రాష్ట్ర విభజన తర్వాత ఆమె తెలంగాణను ఎంచుకున్నారు. తెలంగాణలో వివిధ ప్రాంతాలలో పని చేసిన దివ్య ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్నారు.  ప్రజలకు దగ్గరగా పని చేస్తూ దివ్య తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నారు.  

కలెక్టర్ దివ్య దేవరాజన్ కు పిలుపుకు స్పందించిన మరికొన్ని ఫోటోలు  

 

 

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య కీలక నిర్ణయం

చిన్న పనికే ఈ కలెక్టరమ్మకు పిట్టకూర తెచ్చి ఇచ్చారు