ఏలూరు లో ఓ వింత వ్యాధి స్థానికులని గజగజ వణికిపోయేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏలూరు వాసులకి దైర్యం చెప్తూ , సీఎం జగన్ ఇప్పటికే ఏలూరు భాదితులని పరామర్శించి వచ్చారు. అలాగే మెరుగైన వైద్యం అందించాలని అధికారులకి ఆదేశాలు ,ఇచ్చి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు.
ఇక, తాజాగా ఏలూరు అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సమావేశంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు, జాయింట్ కలెక్టర్ హిమాన్షూ శుక్లా, ఆర్డీవో పనబాక రచన, డీఎంహెచ్వో డాక్టర్ సునంద పాల్గొన్నారు.
అలాగే, ఈ భేటీలో నేషనల్ సెంటర్ ఫర్ డిసిస్ కంట్రోల్ టీం సభ్యులు, పలు ప్రాంతాల నుంచి వైద్యనిపుణులు, సైంటిస్టులు వీడియో కాన్ఫరెన్స్కు హాజరు అయ్యారు. ఏలూరు పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే సాంపిల్స్ సేకరించిన ఎన్ఐఎన్ సైంటిస్టుల బృందంతో సీఎం జగన్ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై త్వరగా నివేధిక ఇవ్వాలని కోరారు. శుక్రవారానికి ప్రాధమిక నివేదిక ఇస్తామని ఎన్ఐఎన్ సైంటిస్టులు తెలిపారు. ఈ రోజు ఏలూరులో పర్యటిస్తున్న కేంద్ర వైద్య నిపుణులతో సీఎం జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా టువంటి సాంపిల్స్ సేకరించారు, ప్రాధమికంగా ఇప్పటికే వచ్చి ఎయిమ్స్ నివేదిక గురించి చర్చించారు.
ఇప్పటి వరకు అస్వస్థతతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి 585 మంది చేరగా.. 503 మంది ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు డిశ్చార్జి చేశారు. ఇంకా 82 మందికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 32 మందిని మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడ,గుంటూరు తరలించారు.