పవన్ ని కోర్టు మెట్లెక్కించబోతున్న జగన్… కీలక నిర్ణయం!

గతవారం పదిరోజులుగా ఏపీలో వాలంటీర్లు వర్సెస్ పవన్ కల్యాణ్ అన్న స్థాయిలో వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే. వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ సమయంలో జగన్ సర్కార్ ఈ ఇష్యూలోకి డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చింది.

వాలంటీర్లపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా… రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. పవన్ దిష్టిబొమ్మలు దహనం చేయడంతోపాటు.. ఆయన ఫోటోలను చెప్పులతో కొట్టారు. పవన్ కల్యాణ్ వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని డిమాంద్ చేశారు.

అయినా కూడా పవన్ తగ్గలేదు. వాలంటీర్లపై ఇప్పటికీ అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఆధార రహిత ఆరోపణలు చేసి బురదజల్లుతున్నారంటూ వైసీపీ నేతలు పవన్ పై ఫైరవుతున్నారు. ఈ నేపథ్యంలో… ప్రభుత్వం డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చింది.

అవును… వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దురుద్దేశంతో కూడినవంటూ ప్రభుత్వం తేల్చింది. అందుకే కోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా… వాలంటీర్లపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు పవన్ కల్యాణ్ పై సంబంధింత కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు గ్రామ-వార్డు వాలంటీర్లు, సచివాలయల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌ జైన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 199/4 ప్రకారం కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో పవన్ వ్యాఖ్యలను ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకుందనేది అర్ధమవుతుందని అంటున్నారు పరిశీలకులు.

గతంలో కూడా బీజేపీ నేతలు వాలంటీర్లపై ఆరోపణలు చేశారు. టీడీపీ నేతలు కూడా వాలంటీర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ పవన్ కల్యాణ్ మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. వుమన్ ట్రాఫికింగ్ కి కారణం వాలంటీర్లేనంటూ నేరుగా ఆరోపణలు సంధించారు. దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. పవన్ ని కోర్టు మెట్లెక్కించబోతోంది.

గా… ఈ నెల 9న ఏలూరులో జరిగిన వారాహి సభలో.. ఏపీలోని గ్రామ, వార్డు వాలంటీర్లపై పవన్‌ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మహిళల అక్రమ రవాణాకు సంబంధించి కీలక సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు చేరవేశారంటూ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు సంబంధించి ఆయన వద్ద ఆధారాలేవీ లేవు.

కేంద్రంలోని నిఘా సంస్థలు కొన్ని తనకు ఈ సమాచారాన్ని చేరవేశాయని చెప్పుకున్నారు. పైగా… ఆ నిఘావర్గాల వారే పవన్ కు చెప్పి ఏపీ ప్రజలను హెచ్చరించమన్నారని చెప్పడం గమనార్హం. దీంతో ఆ సమాచారం ఇచ్చిన అధికారి పేరైనా చెప్పు.. లేదంటే క్షమాపణ అయినా చెప్పాలంటూ ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ పవన్ కు నోటీసులు జారీచేసింది.