అచ్చెన్నాయుడు కేసులో తీర్పు చెబుతూ ఒకే ఒక్క మాట అన్నారు జడ్జి గారు .. ఇదే హాట్ టాపిక్

రాజకీయాల్లో జరిగే పరిణామాలను బ్రహ్మ దేవుడు కూడా ఊహించలేరు. రాజకీయ నాయకులు వేసే ఎత్తుగడలను చాణిక్యుడు కూడా పసిగట్టలేడు. రాజకీయాల్లో జరిగే అంశాలు ప్రజలకు చర్చించుకోవడానికి బాగానే ఉంటాయి కానీ అక్కడ ఏమి జరుగుతుందోననే విషయంలో ఒకటో తరగతి పిల్లోడికి, ప్రజలకు ఏమి తేడా ఉండదు. ఎందుకంటే ఇద్దరికీ ఏమి తెలియదు. ఇప్పుడు మాజీ ఎంపీ, ఎమ్మెల్యే అచ్చన్నాయుడు విషయంలో కూడా అసలు ఏమి జరుగుతుందో అస్సలు అర్ధం కావడం లేదు. ఈఎస్ఐ కేసులో ఆయనను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. రూ. 900 కోట్ల నొక్కేశారని ఆరోపిస్తూ అరెస్ట్ చేసింది.

AP Ex minister Acchen Naidu

అంత కుంభకోణం చేసిన వాణ్ణి బాగా అరెస్ట్ చేశారని సాధారణ ప్రజలకు కూడా ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. అయితే మళ్ళీ కొన్ని రోజులకు తీసుకుంది రూ. 900కోట్లు కాదు రూ. 3కోట్లు అంటూ ప్రభుత్వం మాట మార్చింది. ఈ విషయం విన్న ప్రజలు మూడు కోట్లు అయిన ప్రజల డబ్బు తీసుకున్నాడని, ఆయనకు శిక్ష పడాలని కోరుకున్నారు. ప్రభుత్వం ఆధారాలు చూపిస్తుందని ప్రజలు గట్టిగా నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయింది. ఇప్పుడు కారణం చెపుస్తూ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

బెయిల్ మంజూరు చేస్తూ ” ఇప్పటికే పిటీషనర్ వేసిన బెయిల్ పిటీషన్ ను కింద కోర్టుతో పాటు, హైకోర్టు కూడా కొట్టేసి, ప్రభుత్వ అధికారులకు దర్యాప్తు చేసే ఇచ్చామని, అయినా ఇప్పటి వరకు, పిటీషనర్ డబ్బు తీసుకునట్టు ఎక్కడా ఆధారాలు చూపించలేదని, విజిలెన్స్ గతంలో చేసిన విచారణలో కానీ, ఇప్పుడు అరెస్ట్ చేసిన తరువాత రెండు నెలలు దాటినా తరువాత కూడా పిటీషనర్ పై ఏ ఆధారం ఎందుకు చూపించడం లేదని” జడ్జ్ ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. కేవలం సిఫారసు లేఖల ఆధారంగా ఇప్పటికే 77 రోజులు జైల్లో ఉన్న వ్యక్తికి బెయిల్ ఇవ్వకుండా ఉండలేమని చెప్తూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. జడ్జ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హాట్ టాపిక్ గా మారాయి. కోర్ట్ చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.