హేమ మాలిని కి అరుదైన బర్త్ డే గిఫ్ట్

డ్రీమ్ గర్ల్  హేమ మాలిని 70వ సంవత్సరంలోకి ప్రవేశించింది . ఆమెను చూస్తే ఎవరు ఈ మాటను నమ్మరు . కానీ ఇది ఇది నిజం. . మొన్ననే ముంబైలో తన సినిమా సహచరులు, కుటుంబ సభ్యుల సమక్షంలో  ఈ వేడుకలు  ఘనంగా జరిగాయి . తన ఇద్దరు కుమార్తెలు  ఈశా , అహనా , వారి పిల్లల సంక్షంలోలో హేమ బబర్త్ డే కేక్ కట్ చేసింది .

16 అక్టోబర్ 1948లో మద్రాస్ లో పుట్టింది  . ఆమె తల్లి జయ లక్ష్మి చక్రవర్తి సినిమా నిర్మాత. తండ్రి వి ఎస్ ఆర్  చక్రవర్తి . చదువుకుంటూనే ఆమె భారత నాట్యం నేర్చుకుంది . 1961 లో “ఇదు సాథియం ” అనే తమిళ సినిమాలో డాన్సర్ గా జీవితాన్ని ప్రారంభించింది . ఆ తరువాత 1965లో ఎన్టీఆర్ నటించిన “పాండవ వనవాసం ” చిత్రంలో ఓ పాటలో నర్తించింది హేమ మాలిని. ఆ తరువాత ముంబై వెళ్ళిపోయి హిందీచిత్రాల్లో నటించి ప్రపంచ ప్రఖ్యాతి చెందారు . అయితే ఆమె ఎంత ఎత్తుకు ఎదిగినా , ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా నృత్యాన్ని మాత్రం మర్చిపోలేదు . ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శనలు ఇప్పటికీ ఇస్తూనే వున్నారు .

చాలా సంవత్సరాల తరువాత తెలుగులో బాలకృష్ణ హీరోగా రూపొందిన “గౌతమి పుత్ర శాతకర్ణి ” చిత్రంలో నటించింది . ఈ సినిమాలో బాలకృష్ణ తల్లి గా గౌతమి పాత్రలో అద్భుతంగా నటించింది .

హేమ మాలిని జరుపుకున్న ఈ జన్మదిన సంబరంలో ఓ విశేషమైన ఘటన అందరినీ ఆకట్టుకుంది . ఆమె శ్రేయోభిలాషులు  ఓ అరుదైన కేక్  తెప్పించారు . ఆది ఓ అందమైన పికాక్ . నెమలి ఆకారంలో చేసిన ఈ కేక్ ఎందుకు తెప్పించారో ఎవరికీ అర్ధం కాలేదు . నెమలి నృత్యం అంటే అందరికీ ఇష్టం. హేమ మాలిని ఇప్పటికీ నెమలిలా  నృత్యం చేస్తుంది కాబట్టి కేక్ ను అలా వెరైటీగా చేయించారని భావించారు .  హేమ లైట్ పింక్ కలర్ చీర లో ఎంతో అందంగా ముస్తాబై హుందాగా నడుచుకుంటూ వచ్చింది . ఆమెను చూసిన ఫొటోగ్రాపర్ లు, వీడియో  గ్రాఫర్లు ఒక పట్టాన వదిలి పెట్టలేదు , ఫోటోలు తీస్తూనే వున్నారు .

పార్టీలో ఆమె చిరకాల స్నేహితురాలు రేఖ హేమ ను కౌగిలించుకొని ఆప్యాయంగా బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది . ఈ దృశ్యం చూసి అంటారు చప్పట్లతో  హర్షం  వ్యక్తం చేశారు .