పవన్ ని ఇరకాటంలో పాడేసిన జోగయ్య!

ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఒక డిఫరెంట్ పొలిటీషియన్. ఆయన ఎప్పుడు స్పందిస్తారో, ఎలా స్పందిస్తారో, ఏ విషయంపై ఎలా స్పందిస్తారో చెప్పడం కష్టం! పైగా ఆయన ఏదైనా విమర్శలు చేయాలంటే… అది అధికారంలో ఉన్నా – ప్రతిపక్షంలో ఉన్నా జగన్ పైనే తప్ప మరో నాయకుడిపై చేసేది లేదు. అలాంటి పవన్ గురించి తెలిసే అన్నారో.. లేక, పవన్ అలా మారితే చూడాలనే తపనతో ప్లాన్ చేశారో తెలియదు కానీ… పవన్ కల్యాణ్‌ ను ఇబ్బందుల్లోకి నెట్టే పనికి పూనుకున్నారు హరిరామజోగయ్య.

అవును… అవును… కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ను ఇబ్బందుల్లోకి నెట్టేశారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు రూ.370 కోట్ల అవినీతికి పాల్పడినట్లు వైఎస్ జగన్ అసెంబ్లీలోనే ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తనవి కేవలం ఆరోపణలు మాత్రమే కావని చెప్పిన జగన్.. అందుకు ఆధారాలను కూడా సభ ముందుంచారు. ఈ విషయంలో జగన్ చేసిన ఆరోపణలు, చూపించిన ఆధారాల కారణంగా రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది.

అందులో భాగంగా… ఇంత అవినీతికి పాల్పడిన చంద్రబాబును ప్రశ్నించేందుకు పవన్ గొంతు ఎందుకు లేవదంటూ జగన్ సూటిగా నిలదీశారు. అయితే స్కిల్ డెవలప్మెంట్ అంశంపై పవన్ ఇంతవరకు స్పందించలేదు కానీ… పవన్‌ కు గట్టి మద్దతుదారుడైన జోగయ్య మాత్రం స్పందించారు. జగన్ ఆరోపణలపై పవన్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో తెలుగుదేశంపార్టీతో కలిసి వెళ్ళాలని అనుకుంటున్న పవన్.. స్కిల్ డెవలప్మెంట్ స్కాం పై స్పందించాల్సిన అవసరం ఉందని అంటున్నారు జోగయ్య.

ఇదేక్రమంలో… నీతివంతమైన పాలన అందిస్తానని చెబుతున్న పవన్… బాబు విషయంలో జగన్ చేసిన ఆరోపణలపై స్పందించకపోతే జనాల్లోకి రాంగ్ సిగ్నల్ వెళతాయని సూచిస్తున్నారు జోగయ్య. అలాగే… చంద్రబాబుపై ఆరోపణలు నిరూపితమైతే టీడీపీతో పవన్ ఎలా పొత్తు పెట్టుకుంటారని కూడా ప్రశ్నిస్తున్నారు జోగయ్య. అంటే… ఫైనల్ గా చంద్రబాబుపై వస్తున్న తాజా అవినీతి ఆరోపణలపై పవన్ స్పందించాలన్నది జోగయ్య బలమైన డిమాండ్ అన్నమాట.

అయితే టీడీపీ నాయకులపై ఎప్పుడు ఏ ఆరోపణ వచ్చినా, పోలీసులు అరెస్టు చేసినా కూడా అది ప్రబుత్వ కక్షసాధింపు చర్యగానే పవన్ చూసిన పరిస్థితి! అలాంటి పవన్… చంద్రబాబు మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై కావాలనే స్పందించలేదని అంటున్నారు! సరే జగన్ కోరారని కాడు కానీ… కనీసం జోగయ్య సూచనలు చేసినందుకైనా.. స్కిల్ డెవలప్మెంట్ స్కాం పై పవన్ స్పందించాలని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు!