ఏపికి ఎక్కడ అన్యాయం చేశామో చెప్పాలి: బిజెపి ఎంపీ హరిబాబు

అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో బిజెపి ఎంపీ కంభంపాటి హరిబాబు ప్రసంగించారు. ఏపికి కేంద్రం ఎక్కడ అన్యాయం చేసిందో చెప్పాలని ఆయన టిడిపి ఎంపీలను ప్రశ్నించారు. ప్రత్యేక హోదా స్థానంలో అంతకు మించిన సాయాన్ని అందిస్తున్నాం. ఆ మొత్తాన్ని సైతం కేంద్రం ఇచ్చేందుకు అంగీకరించిందని, ఏపి ప్రభుత్వం కూడా దీన్ని అంగీకరించిందన్నారు. నాబార్డు, హడ్కో నుంచి రుణాలు తీసుకుంటే రుణ భారం పడేది. ఈఏపి కింద ఇచ్చే నిధులు కేంద్రమే ఇస్తానందని తెలిపారు. పోలవరం కోసం ఏడు మండలాలను ఏపిలో కలిపామని, టిడిపి కాంగ్రెస్ తో చేతులు కలపడం ఎన్టీఆర్ ఆశయాలకే విరుద్దమన్నారు.. ఏపి ప్రజల జీవనాడి  అయిన పోలవరాన్ని మేమే పూర్తి చేస్తాం. ప్రత్యేక హోదాతో రాష్ట్రం అభివృద్ది చెందుతుందటే మేము ఇచ్చే వాళ్లమే. ప్రత్యేక ప్యాకేజి కింద సాయం  చేసేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు. అకౌంట్ నంబర్ ఇవ్వండి సోమవారం లోపు ఖాతాలోకి డబ్బులు జమవుతాయని హరిబాబు తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్, విద్యాసంస్థల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను మాత్రమే విభజన చట్టంలో పేర్కొన్నారని దానిపై స్పష్టంగా చెప్పలేదని  అయినా కేంద్రం దానిని పరిశీలిస్తుందన్నారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి రూ.6734 కోట్ల రూపాయలు ప్రాజెక్టుకు మంజూరు చేశాం. ఎక్కడ అన్యాయం చేశామో చెప్పాలన్నారు. కేవలం రాజకీయ అవసరాల కోసమే అవిశ్వాసాన్ని టిడిపి పెట్టిందని   హరిబాబు విమర్శించారు. హరిబాబు ప్రసంగానికి టిడిపి ఎంపీలు పదేపదే అడ్డు తెలిపారు.