YS sharmila: వైయస్ షర్మిలకు షాక్ ఇచ్చిన జీవీ హర్ష కుమార్… తన అన్నయ్య టార్గెట్ అంటూ?

YS sharmila: ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈమె కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏపీలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని నిర్ణయాలపై స్పందిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి ఉంటుంది అయితే షర్మిల మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు.

కాంగ్రెస్ హై కమాండ్ సైతం కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉండగా షర్మిల మాత్రం ఏపీలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల విమర్శలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పాలన గురించి షర్మిల ప్రశ్నించాలి బడ్జెట్ అంశాలు కానీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు పరిచే విధానంలో కానీ షర్మిల పెద్దగా స్పందించడం లేదు.

ఇక ఈమె తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన గురించి తరచూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేయటం, ప్రెస్ మీట్ కార్యక్రమాలలో కూడా తన అన్నయ్య అక్రమాలు చేశారని ఆయనపై ఎంక్వయిరీ చేయాలని తనని అరెస్టు చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహార శైలి పై కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవుతుంది మరోవైపు జగన్మోహన్ రెడ్డి పార్టీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఇలాంటి సమయంలోనే కీలక నేతలను తమ పార్టీ వైపుకు తిప్పుకోవాల్సిన షర్మిల ఆ విషయాన్ని గాలికి వదిలేసి తన అన్నయ్య పట్ల విమర్శలు చేస్తూ ఉండటం పట్ల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవీ హర్ష కుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షర్మిలపై విమర్శలు చేశారు.

సొంత అన్నయ్య వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తే చాలు పార్టీ, రాష్ట్రం ఎలా పోయినా అనవసరం అనే విధానంలో షర్మిల వ్యవహరిస్తోన్నారంటూ విమర్శించారు. తెలుగుదేశం, కూటమి ప్రభుత్వం, బీజేపీ కంటే కూడా ఆమె ఎక్కువగా విమర్శలు చేస్తోన్నది వాళ్ల అన్నయ్య పైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరైనా అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు కానీ ఈమె మాత్రం ప్రతిపక్ష హోదా లేని తన అన్నయ్యను నిలదీస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో పుట్టి పెరిగానని చెప్పిన షర్మిలను తీసుకువచ్చి ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా చేస్తే ఇక్కడ ప్రజలు ఎందుకు తనని ఆదరిస్తారని ఈయన ప్రశ్నించారు.