బ్రేకింగ్ న్యూస్: డుంబ్రిగూడ ఎస్సై సస్పెన్షన్: ఎందుకంటే…

మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందిన ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ అనుచరులు, ప్రజలు, టిడిపి కార్యకర్తులు కోపోద్రిక్తులయ్యారు. దీంతో పోలీస్ స్టేషన్లు, పోలీసులపై దాడికి దిగారు. పోలీస్ స్టేషన్ లో చొచ్చుకెళ్లి ఫర్నిచర్ సామాగ్రికి నిప్పు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో కిడా ఉంది చూడవచ్చు.

ఈ ఘటనకు సంబంధించి విచారణ కొరకు ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ బృందం ఆదివారం రాత్రి నుండి దీనిపై దర్యాప్తు చేపట్టింది. పోలీస్ స్టేషన్లపై దాడికి ఒడిగట్టిన వ్యక్తులు ఎవరో తెలుసుకోవడానికి విచారణ జరుపుతోంది. 15 రోజుల్లోగా దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో నివేదిక అందించాలంటూ సిట్ కు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం.

ఈ నేపథ్యంలో విశాఖ ఏజెన్సీలో దాడులు అదుపు చేయడంలో ఫెయిల్ అయిన పోలీసు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు డుంబ్రిగూడ ఎస్సై అమర్ నాధ్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరు నేతలపై మావోయిస్టుల దాడి జరిగిన తర్వాత నెలకొన్న అల్లర్లను నివారించడంలో విఫలమయ్యాడని ప్రభుత్వం ఎస్సైని సస్పెండ్ చేసింది. ఈ విషయం ప్రాధమిక విచారణలో తేలిందని, అందుకే ఎస్సైని సస్పెండ్ చేశామని డీజీపీ ఆర్పీ ఠాకూర్ వెల్లడించారు. ఈ కేసు విచారణ కొనసాగుతుందని ఆయన అన్నారు.