సంచలనం!! కిడారికి పట్టిన గతే గిడ్డి ఈశ్వరికి: మావోల లేఖ

కిడారి హత్య తర్వాత మావోలు మొదటిసారి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో కిడారి, సోమాలను హత్య చేయడానికి కారణాలు పేర్కొన్నారు. గిడ్డి ఈశ్వరికి ఈ లేఖ ద్వారా ఆమె పాల్పడుతున్న అక్రమాలు మానుకోకపోతే కిడారికి పట్టిన గతే పడుతుందంటూ హెచ్చరించారు. మావోల లేఖలో రాసిన పూర్తి వివరాలు కింద ఉన్నాయి చదవండి.

“ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి మరియు ఎడిటర్ గార్లకు విప్లవాభి వందనములతో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ నుంచి వ్రాయుట.

గిరిజన వ్యతిరేకులు, ప్రజాద్రోహులు అయిన కిడారి సర్వేశ్వరరావును, సివేరి సోములను ఆదివారం అనగా 23-09-2018 న ప్రజాకోర్టులో వారు చేసిన తప్పులకు గాను శిక్షించడము జరిగినది. గూడా క్వారీ విషయములలో ఎన్నోసార్లు హెచ్చరించాను అధికార పార్టీకి తొత్తులుగా మారి మా హెచ్చరికలు లెక్కచేయకుండటమే కాకుండా బాక్సయిట్ త్రవ్వకాలకుగాను లోలోపల ప్రభుత్వానికి సహకరించడం వలన ప్రజాకోర్టులో శిక్షను అమలు చేయడమైనది.

అదే విధంగా గిరిజనులను మోసం చేసి స్వలాభం కోసం కోట్లకు అమ్ముడుపోయిన ప్రజాద్రోహి కిడారికి, అదే విధంగా ఎన్నో తప్పులు చేసిన సివేరిలను కఠినంగా శిక్షించడం జరిగినది. ప్రజల సమక్షంలో వారు చేసిన తప్పులను ఒప్పుకోవడం జరిగినది. అందుకే శిక్షలను అమలు చేయడం జరిగినది.

పోలీస్ వారికి:

గత ఆదివారం మీ తోటి ఉద్యోగ సోదరులు మాకు ఆయుధములతో చిక్కినను వారిని చంపలేదు. పొట్టకూటి కోసం ఉద్యోగాలు చేయుచున్న మీ సహోద్యోగులను పెద్ద మనసుతో క్షమించి విడిచి పెట్టడం జరిగినది. అదే మా విప్లవ సోదరులు మీకు దొరికిన యెడల మీరు దొంగ కధలు అల్లి వాళ్ళని నిస్సహాయులను చేసి ఎన్కౌంటర్ చేస్తారు కదా! మరీ మీరు మా లాగ చేయగలరా ఆలోచించండి.

గిడ్డి ఈశ్వరమ్మా:

ప్రజాద్రోహి, గిరిజన ద్రోహి, అధికార పార్టీకి తొత్తువైన నీవు మమ్ములను విమర్శించడమా! 20 కోట్లకు అధికార పార్టీకి అమ్ముడుపోయిన నీవు మాకు నీతులు చెప్పడమా! కిడారి ప్రజాకోర్టులో నీ విషయం నిజం చెప్పడం జరింగింది. నీకు అందిన అవినీతి సొమ్మును 2 నెలలో గిరిజన ప్రజలందరికి పంచి క్షమాపణ చెప్పాలి. బాక్సయిట్ త్రవ్వకాలకు కూడా వ్యతిరేకించాలి. లేదంటే నీకు కూడా కిడారి, సోములకు పట్టిన గతే పడుతుంది. మేము చెప్పినట్టు చేస్తావు కదా? లేదా మరీ ఈ సమయంలో మంత్రి పదవి దొరుకుతుందని ఆశిస్తావా ఆలోచించుకో!

                                                                                                                                                                    ఇట్లు
                                                                                                                                                                   విప్లవాభి వందనములతో
                                                                                                                                                                 మావోయిస్టు సెంట్రల్ కమిటీ”

ఇది ఆ లేఖ సారాంశం. వారు పంపిన లేఖల ఫోటోలు కింద ఉన్నాయి చూడండి.

 

 

 

 

ఇది కూడా చదవండి

‘‘ తెలంగాణ వాదులను తరిమికొట్టిన మైనంపల్లి , దానం నాగేంద‌ర్‌, తీగల కృష్ణారెడ్డిలను పార్టీలో చేర్చుకొని పెద్ద పీట వేసినప్పడు మీకు సిగ్గు అనిపించలేదా? ’’

కెసియార్ కు ఉత్తమ్ బహిరంగ లేఖ