షాకింగ్: టిడిపి నేత సహాయంతో కిడారి హత్యకు మావోల మాస్టర్ ప్లాన్ ఇదే…

మావోయిస్టుల చేతిలో దారుణంగా హత్య చేయబడ్డారు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ. మావోల దుశ్చర్యతో కసితో రగిలిపోతున్న పోలీసులు గట్టి కౌంటర్ ఇవ్వడానికే చూస్తున్నారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఈ హత్యకు పధకం రచించిన వారి దగ్గర నుండి, అమలు చేసిన వారిని, సహకరించిన వారిని ప్రతి ఒక్కరిని బయటకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసుల విచారణలో పలు షాకింగ్ విషయాలు బయట పడ్డాయి. ఇప్పటికే కిడారి సన్నిహితులను ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి కాల్ డేటాను పరిశీలించిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిసాయి.

అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో కాదు. సొంత పార్టీ నేతలే. మావోలు కిడారి హత్యకు ఆయన సొంత పార్టీ నేతలనే పావులుగా వాడుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నక్సల్స్ కిడారి నియోజకవర్గంలో రాజకీయంగా ఎవరు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారో కనుక్కున్నారు. మన్యంలో గంజాయి స్మగ్లర్ తో చర్చలు జరిపి టిడిపి ఎంపీటీసీ ని ఆగస్టులో రహస్యంగా కలిశారు. వారి రహస్య స్థావరంలో ఆ ఎంపీటీసీతో చర్చలు జరిపారు. తర్వాత టిడిపి మండలస్థాయి నాయకుడితో భేటీ అయ్యారు. కిడారిని రప్పించేందుకు ఆ నాయకుడిని ఒప్ప్పించారు. సెప్టెంబరు 5 న ఎంపీటీసీ, మండలస్థాయి నాయకుడితో మావోలు చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ భేటీలో ఎమ్మెల్యే గ్రామాల్లో పర్యటన విషయాలు ముందే తమకు అందజేయాల్సిందిగా మావోలు సూచించినట్టు తెలుస్తోంది. మావోలకు సదరు ఎంపీటీసీ మూడుసార్లు ఆశ్రయం కల్పించినట్టు పోలీసులకు ఆధారాలు కూడా చిక్కాయి. 

మొదట మండలస్థాయి టిడిపి నాయకుడు సెప్టెంబరు 19 న కిడారిని గ్రామదర్శినికి రావాలని ఆహ్వానించాడు. కిడారి కూడా అందుకు ఒప్పున్నాడు. ఈ విషయాన్నీ వెంటనే మావోలకు అందించాడు ఆ నాయకుడు. ఎమ్మెల్యే హత్యకు పధకం వేసిన ఆ మావోలు రెండు రోజులు ముందే గ్రామానికి చేరుకున్నారు. అక్కడ వారికి ఉన్న అనుకూలతలు, ప్రతికూలతలు మావోయిస్టు మిలిటరీ కమిటీ విభాగానికి చేరవేశారు. అరుణ బృందం ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తమ స్థావరాలకు వెళ్లిపోయారు. తిరిగి సెప్టెంబరు 19 న ఎమ్మెల్యే హత్యకు అంతా సిద్ధం చేసుకున్నారు. కానీ అప్పుడే కిడారి భార్య అనారోగ్యం పాలవడంతో ఆమెని హాస్పిటల్ కి తీసుకు వెళ్లాలని, మరో రోజుకి గ్రామదర్శిని ప్రోగ్రాం పెట్టుకుందామని కిడారి టిడిపి నాయకుడికి తెలిపాడు. దీంతో అరుణ బృందం వెనుదిరిగింది.

వాయిదా వేసిన గ్రామదర్శిని కార్యక్రమాన్ని ఆదివారం పెట్టుకుందాం అని కిడారి పార్టీ నేతలకు ఫోన్ ద్వారా తెలిపారు. ఈ విషయాన్ని ఆ నేతలు మావోలకు చేరవేశారు. మావోలు రంగం సిద్ధం చేసుకున్నారు. కిడారి వచ్చే దారిలో మాటు వేశారు. కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరిల వాహనాలు వస్తుండటం లిపితిపుట్ట వద్ద మాటు వేసిన మావోలు గమనించారు. ఈ సమాచారాన్ని ఊరి బయట గిరిజన నివాసాలున్న జంక్షన్ వద్ద ఉన్న సాయుధ మావోలకు తెలియజేసారు. అదే సమయంలో సారాయి గూడెం నుండి వస్తున్న వాహనాలను, పాదచారులను నిలిపివేసింది మరో దళం. ఎమ్మెల్యేల వాహనాలు అక్కడకు చేరుకోగానే వారి వాహనాలను అడ్డగించించారు మరో దళం సభ్యులు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుని, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమాలను కొద్దిసేపు ప్రశ్నించి, ఆ తర్వాత ఇద్దరినీ కాల్చి చంపేశారు. సదరు టిడిపి నేతలను త్వరలోనే పోలీసులు అరెస్టు చేయనున్నట్టు సమాచారం. ఈ హత్య కేసులో టిడిపి నేతల హస్తమే ఉండటంతో అధిష్టానం పరిస్థితి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అయోమయంలో పడినట్టు తెలుస్తోంది.

 

మరొక హాట్ న్యూస్

తెలంగాణలో బాలయ్య పర్యటన ఆంతర్యం ఏమిటి (వీడియో)