ఒక్కోసారి ఇతరులపై బురద జల్లడానికి ఎంతో ప్లాన్ చేసి, ఎంతో కీలక విశ్లేషణ చేసే ప్రయత్నం చేసినా కూడా… అది బౌన్స్ బ్యాక్ అయ్యి తనవారు అనుకునేవారికి తగులుతుంది. ప్రస్తుతం జగన్ పై బురదజల్లాలని ప్రయత్నించిన ఒక పత్రిక కి.. అది పరోక్షంగా చంద్రబాబుపై పడుతున్న సృహ లేకుండాపోయిందనే కామెంట్లు ఇప్పుడు తెరపైకి వచ్చాయి! “నిజమే కదా” అనే చర్చ ఆన్ లైన్ వేదికగా సాగుతుండటంతో… కుప్పంలో బాబు గెలుపు గురించిన చర్చ మరోసారి వెలుగులోకి వచ్చింది!
వివరాళ్లోకి వెళ్తే… 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు దేశంలో 8 కొత్త నగరాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ఆఫరిచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని కేంద్రం కోరింది. దీంతో… వైఎస్సార్ జిల్లాలోని కడప నగరానికి అతి సమీపంలోని కొప్పర్తి ఏపీ సర్కార్ ప్రతిపాదించింది. దీంతో తమ కలాలకు పనిచెప్పారు కులనేతలు!! అమరావతిని కాదని, ఎక్కడో వెనుకబడిన కడప జిల్లాలోని కొప్పర్తిని ఎంపిక చేస్తారా అంటూ నిలదీతలు మొదలుపెట్టారు!
కేంద్రం నిర్మించాలని అనుకుంటున్న ఒక్కో నగరానికి రూ.1000 కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘం ప్రతిపాదించింది. ఎంపిక చేసిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.250 కోట్లు ఇస్తుంది. అయితే ఇది అమరవాతికి ఏ పక్కకి వస్తుంది? అమరావతి ఇప్పటికే ఏపీ శాసన రాజధాని అని జగన్ సర్కార్ ప్రకటించింది. పైగా సుమారు 51 వేల నిరుపేద కుటుంబాలకు నివాస స్థలాలు ఇచ్చి, మహానగరంగా అభివృద్ధి చేయాలని ఫిక్సయ్యింది. తామెందుకు వాదిస్తున్నదీ బహిరంగంగా చెప్పే ధైర్యం లేని వ్యక్తులు… కొప్పర్తి ఎందుకు ఆ సొమ్ము కూడా అమరావతికే ఇవ్వొచ్చుగా అని వితండవాదం మొదలుపెట్టారు!
జగన్ ఏమో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని భావిస్తుంటే… ఆ పత్రిక మాత్రం అమరావతి అభివృద్ధి చెందితే ఆల్ మోస్ట్ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందినట్లే అనే అర్ధజ్ఞాన కథనాలు అందిస్తున్నారనే చర్చ ఆన్ లైన్ వేదికగా మొదలైపోయింది! దీంతోపాటు కుప్పం తెరపైకి వచ్చింది. కుప్పం ప్రజలు ఇంతకాలం చంద్రబాబుకు నెత్తిన పెట్టుకున్నారు. పరిస్థితులు ఏమైనా… ఆయనకు గెలుపు అందిస్తూ ఉన్నారు. మరి అంత విలువిచ్చిన, రాజకీయ జీవితాన్ని అందించిన కుప్పం నియోజకవర్గం విషయంలో చంద్రబాబు ఇప్పటికీ ఆ ఆలోచన ఎందుకు చేయలేదు? అనే చర్చ మొదలైంది.
కుప్పంలోని నారావారి పల్లె కూడా ఇప్పటికీ కనీసం ఆదర్శ గ్రామం కూడా కాలేని పరిస్థితుల్లో… ఇంతకాలం చంద్రబాబు ఏమి చేసినట్లు అనే కామెంట్స్ మొదలైపోయాయి. ఆస్తులన్నీ అమరావతిలో కొనుక్కుని ఆ ప్రాంతంపై ప్రేమ చూపించడం కంటే… రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ విడతల వారీగా అభివృద్ధికి నోచుకోవాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా! అయినా సరే… జగన్ చేసింది తప్పే అనేది ఒక వర్గం వాదన! ఎవరు ఏమిటన్నది… ప్రజలకు ఎరుకే!!