ఏపీ రైతన్నలకు శుభవార్త… వైయస్సార్ భరోసా డబ్బులు జమ అయ్యేది అప్పుడే?

farmers-sixteen_nine

రైతులను ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్లడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నలకు ఎంతో చేదోడువాదోడుగా నిలుస్తున్నాయి ఈ క్రమంలోనే రైతులకు పంట అవసరాల నిమిత్తం ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధి పథకంలో భాగంగా 6000 రూపాయలను మూడు విడుదలగా రైతుల ఖాతాలో జమ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. దీంతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులకు సరికొత్త పథకాల ద్వారా నగదును రైతుల ఖాతాలో జమ చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కార్ వైయస్సార్ రైతు భరోసా పేరిట ప్రతి ఏడాది ప్రతి రైతు ఖాతాలో నేరుగా డబ్బు జమ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
పీఎం కిసాన్ రైతుభరోసా సాయాన్ని ఈనెల 27న విడుదల చేయనున్నట్లు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. మండస్ తుఫాన్ తో జరిగిన పంట నష్టానికి పెట్టుబడి రాయితీగా రూ.76 కోట్లను అదే రోజు సీఎం జగన్ రైతుల ఖాతాల్లో జమచేస్తారని వెల్లడించారు.

ఈ క్రమంలోనే హరి కిరణ్ అన్ని జిల్లాల వ్యవసాయ సహాయ వ్యవసాయ సంచాలకులతో ఈయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిబ్రవరి 28 లోగా రబీ ఈ-క్రాప్, ఈ కేవైసీ పూర్తి చేయాలని చెప్పారు హరికిరణ్. వేసవిలో సాగయ్యే పంటలకు మార్చి, ఏప్రిల్ లో ఈ క్రాప్ నమోదుకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు.ఇలా జగన్ సర్కార్ రైతుల పట్ల తీసుకుంటున్నటువంటి రైతులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎన్నో రకాల సేవలను రైతులకు అందిస్తున్న సంగతి మనకు తెలిసిందే.