జగన్ ని బెదిరిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే… డెడ్ లైన్ పెట్టారు!

ఏపీ అధికారపార్టీలో మరో అసంతృప్త నేత తెరపైకి వచ్చారు. ఇప్పటికే తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మరోకారణంతో.. ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీకి దూరమైన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో… ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి తాజాగా అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు. ఈ సందర్భంగా ఆయన… వైఎస్ జగన్ కు అల్టిమేటం జారీ చేశారు.

అవును… తనను పార్టీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, పార్టీలోని పెద్దలు కూడా తనను పట్టించుకోకపోవడం లేదని, ఇదే తీరు కొనసాగితే.. తాను మరో రెండు నెలల్లో గట్టి నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందని బెదిరింపు దోరణిలో మాట్లాడుతున్నారు అన్నా రాంబాబు! అయితే రాంబాబుని పార్టీ పట్టించుకోకపోవడం కాదు… కేడర్ నే రాంబాబు పట్టించుకొవడం లేదని, పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని.. మరోసారి అన్నారాంబాబుకి టిక్కెట్ ఇస్తే సహకరించేది లేదని వైసీపీ క్యాడర్ చెబుతున్న పరిస్థితి!

2009లో ప్రజారాజ్యం నుంచి గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయిన అన్నా రాంబాబు.. అనంతరం టీడీపీ నుంచి 2014లో పోటీచేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే 2019 ఎన్నికల నాటికి వైసీపీ నుంచి గెలిచిన అశోక్ రెడ్డిటీడీపీలో చేరడంతో… మళ్లీ 2019ఎన్నికల్లో చివరినిమిషంలో వైసీపీలో చేరారు రాంబాబు. దాంతో మళ్లీ అశోక్ రెడ్డితోనే పోటీపడిన ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు.

అంటే… గిద్దర్లూరు నుంచి వైసీపీ తరుపున ఎవరు పోటీచేసినా గెలుస్తారన్న మాట. ఎందుకంటే… గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ తర్వాత అత్యధిక మెజారిటీ సాధించిన నియోజకవర్గం ఇది! ఈ విషయాలు మరిచిన రాంబాబు… ఆ విజయం పూర్తిగా తన గొప్పతనమే అని ఫీలవుతుంటారని చెబుతుంటారు స్థానిక క్యాడర్. చివరి నిమిషంలో గిద్దలూరు వంటి వైసీపీ కంచుకోటని అప్పగిస్తే… జగన్ వేవ్ లో, కేడర్ సహాయంతో గెలిచిన ఆయన… అనంతరం ఆ విషయాలు మరిచిపోయారని చెబుతున్నారు.

మరి ఈ రేంజ్ లో జగన్ కు రెండు నెలలు డెడ్ లై పెట్టి అన్నా రాంబాబు విషయంలో ఈలోపే పార్టీ అధిష్టాణం ఒక నిర్ణయానికి వచ్చేస్తుందా? లేక, ప్రస్తుతానికి సైలంటుగా చూస్తూ ఉంటుందా అనేది వేచి చూడాలి!