జెండర్ బడ్జెట్: దేశంలోనే తోలిసారి..జగన్ సంచలన నిర్ణయం !

మహిళ అంటే ఆకాశంలో సగభాగమని.. ఆర్ధిక, సామాజిక, రాజకీయంగా మహిళలకు హక్కులు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గత 21 నెలల్లో రాష్ట్ర మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాం.

CM YS Jagan Participating In Womens Day Celebrations - Sakshi

అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, కాపు నేస్తం మహిళల పేరిట ఇళ్ల స్థలం, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు వంటి పథకాలు తెచ్చాం ప్రతి రంగంలోనూ మహిళలు అభివృద్ధి చెందాలి. చదువులకు పేదరికం అడ్డుకాకూడదనే అమ్మఒడి పథకం తీసుకొచ్చాం. రెండేళ్లలో రూ.13,220 కోట్లు అమ్మఒడి పథకం కింద ఇచ్చాం. ఐదేళ్లలో రూ.32,500 కోట్లను అమ్మఒడి కింద ఇస్తాం. వైఎస్సార్‌ చేయూత కింద రూ.4,604 కోట్లు ఇచ్చాం. ఇళ్ల స్థలాల ద్వారా మహిళలకు రూ.27వేల కోట్లు ఇచ్చాం. అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్‌ చేయూత ద్వారానే 21 నెలల్లో రూ.80వేల కోట్లు అందించాం. మహిళా ఉద్యోగుల క్యాజువల్ లీవ్స్‌ 20 రోజులకు పెంచాం. 13 జిల్లాల్లో దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేశాం. మహిళలపై నేరాలకు సత్వర విచారణ చేస్తున్నామని’’ సీఎం జగన్‌ అన్నారు.

దేశంలోనే తొలిసారిగా జెండర్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నామని సీఎం తెలిపారు. మహిళలపై వేధింపుల నిరోధానికి ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తామని, 10 మందికి మించి మహిళలు ఉన్న కార్యాలయాల్లో కమిటీలు నియమిస్తామని పేర్కొన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లోనూ మహిళా హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. 900 దిశ పెట్రోల్‌ వెహికల్స్‌, 18 దిశ క్రైం సీన్‌ మేనేజ్‌మెంట్‌ వెహికల్స్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.