ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు ఒక్కసారిగా రాజకీయంగా వేడి రాజేశాయి. ఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లోనూ అధికార వైకాపా ఓటమి పాలవ్వడంతో… అందులోనూ ముఖ్యంగా ఉత్తరాంధ్ర లో కూడా పరాజయం పాలవ్వగా.. రకరకాల చర్చలు తెరపైకి వచ్చాయి. దీంతో ఎలాగైనా సార్వత్రిక ఎన్నికలకు ముందు బాబుక్ ఒక షాక్ ఇస్తే పడితుదాని జగన్ భావిసున్నారంట.
జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంశల్లో మూడు రాజధానుల టాపిక్ ఒకటి. అందునా ముఖ్యంగా విశాఖలో పరిపాలనా రాజధాని పెట్టాలని. అయితే… ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఓడిపోవడంతో… “విశాఖను రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకోవడం లేదు” అనే చర్చను తెరపైకి తెచ్చింది టీడీపీ. దీంతో వారి నోళ్లు ఎలాగైనా ముగించాలని, వారి కామెంట్లకు దిమ్మతిరిగే కౌంటర్స్ ఇవ్వాలని ఫిక్సయ్యారంట వైకాపా నేతలు! ఇందులో భాగంగా.. విశాఖలో ఒక ఉప ఎన్నికకు ప్లాన్ చేస్తున్నారంట. అందుకు హెల్ప్ అవుతున్నది… గంటా శ్రీనివాసరావు!
అవును… సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒక ఉప ఎన్నికకు వెళ్లి.. బాబు & కోలకు సరైన సమాధానం చెప్పాలని రివేంజ్ మూడ్ లో ఉన్నారంట వైకాపా నేతలు. వీరి రివేంజ్ తీరడానికి ఒక ఆప్షన్.. గంటా రాజినామా లేఖ రూపంలో ఎదురొచ్చిందంట. టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా రాజీనామా లేఖ ఇచ్చినసంగతి తెలిసిందే. 2021 ఫిబ్రవరి 12న స్పీకర్ ఫార్మాట్లో గంటా శ్రీనివాస్ తన రాజీనామా లేఖను అందించారు. ఈ లేఖపై స్పీకర్ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో.. స్పీకర్ తో మాట్లాడి ఈయన రాజీనామా లేఖను ఆమోదించేస్తే బెటరని వైకాపా నేతల్ ఫిక్సయ్యారంట.
జగన్ కు ఎలాగూ ముందస్తుకు వెళ్లాలన్న ఆలోచన కానీ అవసరం కానీ లేవు. కాబట్టి వీలైనంత తొందర్లో గంటా రాజీనామాను ఆమోదింపచేసేసుకుని.. గంటాకు ఆపోజిట్ గా ఒక బలమైన వైకాపా నేతను నిలబెట్టి… విశాఖను రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎంత బలంగా క్రుకుంటున్నార తెలియజెప్పాలని భావిస్తుందట!
అయితే… ఇక్కడొక సమస్య ఉంది. వైసీపీ నాయకత్వం ఎన్నికకు వెళ్లాలని నిర్ణయిస్తే అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈలోగా ఉపఎన్నిక జరగాలంటే అసెంబ్లీ కార్యాలయం ఖాళీ నోటిఫై చేసిన తర్వాత ఆరు నెలల్లోగా ఎన్నిక జరగాల్సి ఉంటుంది. నిర్వహించిన మరికొద్ది నెలలోనే సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నిక అనివార్యమైతే మాత్రం… కర్ణాటక రాష్ట్ర ఎన్నికలతో పాటుగా ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఎన్నిక ద్వారా టిడిపి జనసేన పొత్తు పై కూడా ప్రజలకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
సో… మరి అధికార వైసీపీలో చర్చ జరుగుతున్నట్టుగా గంట శ్రీనివాస్ రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తారా..? ఉప ఎన్నిక జరుగుతుందా..? అన్నది ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.