చంద్రబాబుకు చెప్పే చేస్తా.. త్వరలోనే సెన్సేషన్ సృష్టించనున్న గంటా ?

Ganta Srinivasa Rao maintaining same curiosity 
తెలుగుదేశం కీలక నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతారని గత కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఇదిగో ఇప్పుడు వెళ్తారు, అదిగో అప్పుడు వెళ్తారు అంటూ వార్తలు హల్చల్ చేశాయి.   కానీ ఇప్పటివరకు టీడీపీని వీడలేదు గంటా.   వైసీపీలోకి వెళ్లడానికి వైఎస్ జగన్ సన్నిహితవర్గంతో మంతనాలు జరిపిన గంటా ఇంకా ఫైనల్ డెషిషన్ తీసుకోలేదు.  అందుకు కారణం వైసీపీలో కీలక నేతలైన విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్ అనే మాట వినిపిస్తోంది.  గంటా వచ్చి విశాఖలో తమ హవాకు గండికొడితే ఎలాగని  భావించిన ఈ ఇద్దరు నేతలు బాగానే మోకాలడ్డారు.  దీంతో జగన్ వైపు నుండి గంటకు స్పష్టమైన హామీ ఏదీ రాలేదు.  అందుకే ఆయన నెమ్మదించారు.  ఇలా మానటనలు నడుస్తుండగానే గంటాకు సంబంధించిన భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. 
 
Ganta Srinivasa Rao maintaining same curiosity 
Ganta Srinivasa Rao maintaining same curiosity
ఆ పరిణామంతో గంటా ఈగో దెబ్బతింది.  స్నేహానికి సిద్ధమైతే కయ్యానికి కాలు దువ్వుతారా అంటూ రివర్స్ అయ్యారు ఆయన.  అప్పటికప్పుడు స్థానిక టీడీపీ నేతలతో, శ్రేణులతో మీటింగ్ పెట్టుకుని స్థానిక ఎన్నికల్లో విశాఖలో టీడీపీ జెండా పాతి ప్రత్యర్థులకు ఘలక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.  ఆ సామవేశ్మతో గంటా ఇక పార్టీ మారబోరని టీడీపీ శ్రేణులు డిసైడ్ అయ్యారు.  కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ గంటా గాలి వైసీపీ వైపుకు మళ్లినట్టుంది.  తాజాగా మీడియాతో  మాట్లాడుతూ టీడీపీలోనే ఉండిపోతానని కానీ వైసీపీలోకి వెళతానని కానీ చెప్పకుండా ఆ ఉత్కంఠను మైంటైన్ చేశారు.  తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని, ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచానని, టీడీపీ ఎమ్మెల్యేగానే ఉన్నానని తేల్చి చెప్పారు.  ఎన్నికలకు ముందు, ఎన్నికల్లో గెలిచాక తనపై పార్టీ మారుతానని ప్రతిసారి పబ్లిసిటీ ఇస్తున్నారని, అవసరమైనప్పుడు అన్ని సందేహాలను నివృత్తి చేస్తానని చెప్పారు. 
 
అంతేకాదు గతంలో టీడీపీని వీడి ప్రజారాజ్యంలోకి వెళ్ళేటప్పుడు చంద్రబాబుకు చెప్పే వెళ్ళానని, ఇప్పుడు కూడ పార్టీని మారదల్చుకుంటే చెప్పే చేస్తానని అన్నారు.  అన్ని అంశాలను కాలమే నిర్ణయిస్తుంది.  నేనేమిటో రాబోయే రోజుల్లో చెబుతా.  సంతృప్తి అనేది రిలేటీవ్ అంశం.  తెలుగుదేశం పార్టీలో సంతృప్తి ఉందా? లేదా? అనేది త్వరలో చెప్తాను.  టీడీపీలో ఎమ్మెల్యేలు బయటకు వెళ్లడం, అసంతృప్తి అనేది వాళ్ల వ్యక్తిగతం.  నేను వేరే పార్టీలోకి వెళ్లాలనుకున్నా, మరే నిర్ణయం తీసుకోవాలనుకున్నా అందరితో చర్చించి తీసుకుంటాను.  ఇందులో రహస్య నిర్ణయాలు ఉండవు అంటూ నర్మగర్భంగా మాట్లాడారే తప్ప టీడీపీలోనే  ఉండిపోతానని కానీ వైసీపీలోకి వెళతానని కానీ ఖచ్చితంగా చెప్పేలేదు.  దీన్నిబట్టి గంటా వైసీపీలో చేరిక విషయంలో ఇంకాస్త సమయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారనే అనిపిస్తోంది.  కాబట్టి ఏ సమయంలో అయినా ఆయన్నుండి సంచలన నిర్ణయం వెలువడే అవకాశం లేకపోలేదు.