విశాఖ జిల్లాలో గంటా శ్రీనివాసరావు బలమైన నాయకుడన్నది అందరికీ తెలిసిందే. విశాఖలో టీడీపీ క్షేత్ర స్థాయిలో ఇప్పటికీ బలంగా ఉందంటే? కారణం గంటానే. ప్రకాశం జిల్లా నుంచి వచ్చి విశాఖ లో పాగా వేసిన గంటాను విశాఖ నుంచి వెకేట్ చేయించడం అన్నది అంత ఈజీ పని కాదు. ఇప్పటికీ గంటా జిల్లాలో నియోజక వర్గాల్ని, మండలాల్ని ఎప్పటికప్పుడు చుట్టేస్తుంటారు. అదే ఇక్కడ ఆయనకు సక్సెస్ సీక్రెట్. నేతల్ని..కార్తకర్తల్ని సమన్వ పరచడం అవసరాలు తీర్చడం వంటివి గంటా చాలా తెలివిగా చేస్తారు. ఇది గంటా ఇన్నర్ ట్యాలెంట్. ప్రస్తుతం రాజకీయంగా టీడీపీ అధికారంలో లేదు కాబట్టి ఇప్పుడాయన వైసీపీలోకి వెళ్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆయన ఎంట్రీ జరిగిపోవాలి.
ఈనెల 15వ తేదీన ప్యాన్ కిందకి రావడానికి ముహూర్తం పెట్టినట్లు ప్రచారం సాగాంది. కానీ ఆలస్య మవుతోంది. మరో వైపు గంటా ఎంట్రీని ఎలాగైనా అడ్డుకోవాలని ముత్తం శెట్టి శ్రీనివాసరావు, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అదిష్టానం గంటా ఎంట్రీ కే ఆసక్తి చూపుతోంది అన్నది అంతకు మిgచిన బలమైన ప్రచారం. విశాఖ వ్యాప్తంగా గంటాకు భారీ ఆస్తులు ఉన్నాయి. ల్యాండ్ ల పరంగా..అదీ పరిపాలనా రాజధాని అభివృద్ధి ప్రాంతంలో గంటాకి-చిరంజీవికి భారీగా భూములు న్నాయి. ఇప్పుడవన్నీ కూడా బంగారం అయ్యాయి. అభివృద్ధి అంతా అక్కడే జరుగుతోంది.
ఇక గంటా రాజకీయంగాను జిల్లాలో పలుకబడి ఉన్న నాయకుడు. అందుకే జగన్ గంటా ఎంట్రీకి లైన్ క్లియర్ చేసారు. అటు మంత్రి బోత్స సత్యనారాయణ కూడా గంటా రావాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇరువురు ఒకే సామాజిక వర్గం. గంటా వస్తే బొత్సకు బలం కూడా పెరుగుతందని భావిస్తు న్నారుట. గతంలో ఇరువురు వేర్వేరు పార్టీలు అయినప్పటికీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఒకే పార్టీలో ఉంటేనే ఉత్తమం అని భావిస్తున్నారు. సరిగ్గా ఈ అవకాశాన్నే గంటా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి పావులు కదుతుపున్నారుట.
ఖాళీగా ఉన్న వీఎంఆర్డీఏ పదవి గంటాకు ఇప్పించాల్సిందిగా బొత్సా అదిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఆ పోస్ట్ కేబినేట్ హోదాతో సమానం. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు విస్తిరించి ఉన్న ఈ సంస్థకు క్యాబినేట్ హోదా ఉంటుంది. విశాఖలో గంటాకు ఉన్న ల్యాండ్లు అన్ని వృద్ధిలోకి రావాలంటే పార్టీలోకి రావడానికి లైన్ క్లియరెన్స్ తో పాటు, వీఎంఆర్డీఏ కూడా ఇప్పించాల్సిందిగా డిమాండ్ కు తెర లేపనట్లు ప్రచారం సాగుతోంది. గతంలో ఈ పోస్ట్ ని చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన దగ్గర పెట్టుకున్నారు. మరి జగన్ అంత ఈజీగా గంటాకు కట్టబెట్టేస్తారా? అంటే ఈజీ కాదనే అనాలి.