పెద్ద ప్రశ్నే ఇది: ఏపీలో కనిపించని రంగు ఏది?

ఏపీలో ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికలు మామూలు రసవత్తరంగా సాగవు అనేది విశ్లేషకుల మాట! త్రిముఖ పోటీనా – ద్విముఖ పోటీనా అన్న విషయంపై ఇంకా క్లారిటీ రానప్పటికీ… పోటీ మాత్రం ఒక స్థాయిలో ఉంటుందనే చెప్పుకోవాలి. అందుకు కారణం… ఈ ఎన్నికల అనంతరం ఒక పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యే సూచనలు పుష్కలంగా ఉన్నాయంట!

వివరాళ్లోకి వెళ్తే… కాసేపు అధికారపార్టీని పక్కనపెట్టి ప్రతిపక్ష పార్టీల సంగతి పరిశీలిద్దాం! గతమెంతో ఘనం, వర్తమానం అయోమయం, భవిష్యత్తు ప్రశ్నార్థకం అన్నట్లుగా ఉంది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పరిస్థితి. ప్రస్తుతం చంద్రబాబు వయోభారం రీత్యా ఆ పార్టీ మనుగడ సాగించాలంటే కచ్చితంగా చినాబాబు లోకేష్ ఫెర్మార్మెన్స్ మెరుగుపడాలి!

ఈ లెక్కన ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, గతంలో మంగళగిరి ఇచ్చిన ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశీలిస్తే… రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాని పక్షంలో… పసుపు రంగు షేడ్ అయిపోయే పరిస్థితులు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు! అలా కాకుండా… ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే కొంతకాలం నడిచే పరిస్థితి ఉంది!

ఇక జనసేన విషయానికొస్తే… ఆ పార్టీకి ఈ ఎన్నికలు డూ ఆర్ డై లాంటివి అనడంలో సందేహం ఏమీ లేదనే చెబుతున్నారు విశ్లేషకులు! ఏ లక్ష్యంతో పవన్ రాజకీయాల్లోకి వచ్చారో, ఆ లక్ష్యం నెరవేరాలంటే ఒంటరిగా పోటీచేసి గెలవాలని కొందరు సూచిస్తున్నారు. అదే జరిగితే వీర మరణమే అని పవనే నేరుగా చెబుతున్న పరిస్థితి!

ఈ పరిస్థితుల్లో అధికారం సంగతి కాసేపు పక్కనపెట్టి.. ముందు పార్టీని బ్రతికించుకోవాలి అనుకుంటే.. పొత్తులతో వెళ్లడమే మంచిదని మరికొందరు సూచిస్తున్న పరిస్థితి. అయితే ఉదాహరణకు రాబోయే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తులో పోటీచేసి అధికారంలోకి వస్తే.. జనసేన మనుగడకు ఇబ్బంది ఉండకపోవచ్చు.

అలా కాకుండా… పొత్తు అనంతరం కూడా 2019 ఫలితాలే రిపీట్ అయితే మాత్రం… ఎరుపు రంగు కూడా పూర్తిగా ఫేడ్ అవుట్ అయిపోయే ప్రమాధం పూర్తిగా ఉందని అంటున్నారు! సో.. రాబోయే ఎన్నికలు టీడీపీ – జనసేన ల భవిష్యత్తును నిర్ణయించబోయేవి మాత్రమే కాకుండా… దాదాపుగా మనుగడ ప్రశ్నార్థకతను కూడా నిర్ణయించేవి అనడంలో ఎలాంటి సందేహం లేదన్నమాట!

అధికారపార్టీ విషయానికొస్తే… ప్రస్తుతం అత్యంత బలంగా కనిపిస్తున్న వైఎస్సార్సీపీ, వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి వస్తే.. ఒక ఆ పార్టీకి ఇప్పట్లో వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండకపోవచ్చు. అలా కాకుండా… అధికారంలోకి రానిపక్షంలో.. వచ్చిన సీట్ల సంఖ్యను బట్టి ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉండే పరిస్థితిగా చెబుతున్నారు విశ్లేషకులు!

ఏది ఏమైనా… ఎలా చెప్పుకున్నా.. ఎంత చెప్పుకున్నా.. ఏపీలో రాబోయే సార్వత్రిక ఎన్నికలు మాత్రం అత్యంత రసవత్తరంగా జరగబోతున్నాయి అనేది మాత్రం వాస్తవం అనే చెప్పుకోవాలి! మరి ఆ రసవత్తర ఫలితం ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే… మరో ఏడాదిపైనే వేచి చూడాల్సిందే!