విజయవాడ మాజీ ఎంపీ మృతి

మాజీ పార్లమెంటు సభ్యురాలు చెన్నుపాటి విద్య(84) మృతిచెందారు. విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి ఆమె రెండుసార్లు ఎంపికయ్యారు. చెన్నుపాటి విద్య ప్రముఖ నాస్తికవాది గోరా కుమార్తె. కాగా… మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య మృతిపట్ల మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావుతోపాటు పలువురు సంతాపం తెలిపారు.

రెండుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఆమె సేవలు ప్రశంసనీయమని, మహిళాభ్యుదయం కోసం విద్య ఎనలేని కృషి చేశారని చంద్రబాబు అన్నారు. చెన్నుపాటి విద్య మృతి విజయవాడకే కాదు రాష్ట్రానికే తీరని లోటని చంద్రబాబు అన్నారు.