వైసిపిలో చేరిన మాజీ ఎంఎల్ఏ..పార్టీకి ప్లస్సే (వీడియో)

ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గం మాజీ ఎంఎల్ఏ అన్నా వెంకటరాంబాబు వైసిపిలో చేరారు. రాంబాబు 2009లో ప్రజారాజ్యంపార్టీ తరపున ఎంఎల్ఏగా గెలిచారు. వైశ్య సామాజికవర్గానికి చెందిన రాంబాబు పోయిన ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ తరపున పోటి చేసి ఓడిపోయారు. అప్పట్లో ముత్తముల అశోక్ రెడ్డి వైసిపి తరపున గెలిచారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో అశోక్ రెడ్డి టిడిపిలోకి ఫిరాయించారు. అప్పటి నుండి నియోజకవర్గంలో కొంత గ్యాప్ వచ్చింది. అయితే మాజీ ఎంఎల్ఏ సాయి కల్పనారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో కాస్త యాక్టివ్ గానే ఉన్నారు. దానికితోడు వచ్చే ఎన్నికల్లో సాయి కల్పనారెడ్డి పోటీకి రెడీ అవుతున్నారు.

 

ఈ నేపధ్యంలో అన్నా రాంబాబు పార్టీలోకి రావటానికి మాజీ మంత్రి బాలనేని శ్రీనివాసులరెడ్డి చొరవ తీసుకున్నారు. నిజానికి రాంబాబు పార్టీలో చేరటం వైసిపికి ప్లస్ పాయింటే. కానీ టిక్కెట్టు విషయంలోనే కాస్త గందరగోళం మొదలయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఎలాగంటే, వచ్చే ఎన్నికల్లో  టిక్కెట్టు ఇచ్చే హామీతోనే అన్నా రాంబాబు వైసిపిలో చేరారు అనే ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో మాజీ ఎంఎల్ఏ సాయి కల్పనారెడ్డి కూడా టిక్కెట్టు మీద భరోసాతోనే నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు. మరి ఈ నేపధ్యంలో ఇద్దరి మధ్య గందరగోళం మొదలయ్యే అవకాశాలున్నాయి.

 

అదే సమయంలో టిడిపి ఎంఎల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అండ్ కో కూడా తొందరలో వైసిపిలో చేరనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే మాగుంట ఒక్కరే రారు. మాగుంటతో పాటు మద్దతుదారులు ఉగ్ర నరసింహారెడ్డి లాంటి వారు కూడా చేరుతారు. ఉగ్ర నరసింహారెడ్డి కూడా ఇక్కడ మాజీ ఎంఎల్ఏలనే అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఉగ్రకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు విషయంలో చంద్రబాబు హామీ ఇచ్చారట. కాబట్టి టిక్కెట్టు హామీ విషయంలో జగన్ దగ్గర మాగుంట పట్టుబట్టే అవకాశముంది. అప్పుడు నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారనే విషయంలో మరింత గందరగోళం పెరిగే అవకాశం ఉంది.

 

నిజానికి సాయి కల్పనారెడ్డికి టిక్కెట్టిస్తేనే న్యాయం చేసినట్లవుతుంది. ఎందుకంటే, ఎప్పటి నుండో పార్టీలోనే యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి. మరి టిక్కెట్టు విషయంలో జగన్ సమీకరణలు ఏమున్నాయో ఎవరికీ అర్ధం కావటం లేదు. కాబట్టి జగన్ బయటపడేంత వరకూ అందరు అభ్రదతోను, పోటీ తత్వంతోను పనిచేయాల్సిందే తప్పదు. వచ్చే నెలాఖరులోగా చాలా నియోజకవర్గాల్లో అభ్యర్ధులపై జగన్ క్లారిటీ ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి జగన్ ఏమి చేస్తారో చూడాల్సిందే.