అన్నా రాంబాబు మీద ఆ కేసులు ఏమైనట్టు !?

Janasena activists asking about cases on Anna Rambabu 
వారానికొకరు చొప్పున వైసీపీ నేతలు ఒక్కొక్కరు హైలెట్ అవుతూ వస్తున్నారు.  ఒక వారం ఒక లీడర్ వార్తల్లో నిలిస్తే ఇంకొక వారం మరొకరు.  ఇక్కడ ట్విస్టేమిటంటే ఎక్కువమంది వార్తల్లోకి ఎక్కుతున్నది మాత్రం వివాదాలతోనే కావడం.  తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు వివాదం హాట్ టాపిక్ అయింది.  జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు ఆత్మహత్యకు కారణం అన్న రాంబాబు కించపరిచేలా మాట్లాడటం, ఆయన అనుచరులు బెదిరింపులకు పాల్పడటమేనని పవన్ కళ్యాణ్ సహా జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.  ఎమ్మెల్యే వెంగయ్య నాయుడు సహా కొందరు జనసేన కార్యకర్తలను బూతులు తిన్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
 
Janasena activists asking about cases on Anna Rambabu 
Janasena activists asking about cases on Anna Rambabu
రాంబాబు సైతం జనసేన నేతలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.  తమ వాడుక భాష అలాగే ఉంటుందని, తానే తప్పూ చేయలేదని, ఆస్తులు అమ్ముకుని సేవ చేస్తున్నానని, జనసేన శవ రాజకీయం చేస్తోందని, పవన్ కు దమ్ముంటే   తనపై గెలవాలని సవాల్ చేశారు.  అన్నా రాంబాబు గత ఎన్నికలో మంచి మెజారిటీతో గెలుపొందారు.  కానీ కొన్నాళ్ల తర్వాత అసంతృప్తికి గురయ్యారు.  కారణం పనులు జరక్కపోవడం, పట్టించుకోకపోవడమే.  పార్టీలోని నేతలే ఆయన్ను పట్టించుకోలేదు.  కోవిడ్ సెంటర్ నిర్వహణకు ఆయనకు చెందిన భావనాన్ని ప్రభుత్వం వారికి ఇచ్చారు.  దాన్ని వాడుకుని అద్వానపు స్థితిలో తిరిగి అప్పగించారట.  వాటి మరమ్మత్తులకు భారీగా ఖర్చవుతుందని, ఈ సంగతిని పార్టీ పెద్దల వద్దకు, అధికారులు వద్దకు తీసుకెళ్లినా రెస్పాన్స్ రాలేదని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి.  
 
అలాంటి నేత ఇప్పు వివాదాలకు కేంద్ర బిందువయ్యారు.  గతంలో కూడ పలుమార్లు రాంబాబుగారి మీద వివాదాలు నడిచాయి.  పెద్దరవీడు మండలం దేవరాజు గుట్టలో స్థల వివాదంలో మహిళను దుర్భాషలాడిన వివాదంలో ఆయన మీద కేసు నడవడం, కోర్టులో వ్యతిరేక తీర్పు రావడం, చివరకు రాజీకి వెళ్లడం జరిగాయి.  ఈమధ్య చెన్నై శివార్లలో తమిళనాడు పోలీసులు భారీ నగదుతో ఉన్న కారును పట్టుకున్నారు.  ఆ డబ్బు వైసీపీకి చెందిన కీలకమైన నేతదనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి.  ఆ నేత వాటిని ఖండించారు కూడ.  దాన్ని పక్కనపెడితే ఆ డబ్బు దీరిన కారు మీద ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్టిక్కర్ ఉంది.  కానీ ఆ స్టిక్కర్ ఆ కారు మీదకు ఎలా వెళ్లిందో తనకు తెలియదని రాంబాబు అన్నారు.  ఆ తర్వాత కొన్నిరోజులు ఆ వివాదం మరుగునపడిపోయింది.  ఇప్పుడు జనసేనలో రేగిన వివాదంతో ఆ కేసు ఏమైందో చెప్పాలని జనసేన శ్రేణులు అడుగుతున్నారు.
 
 
 
Keywords: YSRCP MLA, Giddalur MLA, Anna Rambabu, YSRCP, Janasena, Pawan Kalyan, Vengaiah Naidu, వైసీపీ ఎమ్మెల్యే, గిద్దలూరు ఎమ్మెల్యే, అన్నా రాంబాబు, జనసేన, పవన్ కళ్యాణ్, వెంగయ్య నాయుడు