ఫ్లాష్ న్యూస్ : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ !

aswini dutt and krishnam raju petition in ap high court on capital lands

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఏడాదిన్నరగా కొనసాగుతున్న వివాదానికి హైకోర్టు తెరదించింది వేసింది. తాజాగా పంచాయితీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తీర్పు వెల్లడించింది. గత కొన్నిరోజులుగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ సీఎం జగన్ మోహన్ రెడ్డి యుద్ధంలో ఈ ఎన్నికల నిర్వహణ ఏపీలో కష్టమైంది.

ఈ క్రమంలోనే హైకోర్టులో ఎస్ఈసీ అప్పీల్ పై రెండు రోజులుగా వాదనలు విన్న హైకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. కాసేపటి క్రితం ఏపీ హైకోర్టు ఏపీలో స్థానిక ఎన్నికలపై తీర్పును ఇచ్చింది. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఎస్ఈసీ వేసిన రిట్ అప్పీల్ పిటీషన్ ను హైకోర్టు అనుమతించింది. వ్యాక్సినేషన్ కు ఎన్నికలు అడ్డుకాదని ఎస్ఈసీ తరపున న్యాయవాదులు వాదించారు. కరోనా వ్యాక్సినేషన్ వల్ల ఎన్నికలు నిర్వహించలేమని ఇప్పటికే ప్రభుత్వం తరుఫున వాదించారు. అయితే హైకోర్టు మాత్రం పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని తాజాగా ఆదేశాలిచ్చింది. వ్యాక్సినేషన్ తో ఎన్నికలకు సంబంధం లేదని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు పై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.