ఆయనో సినీ దర్శకుడు. పైగా, ప్రముఖ సినీ దర్శకుడు. అన్ని రాజకీయ పార్టీలతోనూ ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయ్. కుర్రాడేమీ కాదు.. అలాగని వృద్ధుడూ కాదు.! వయసు ఇంకా చాలానే వుంది. సినిమాల్లో రాణించడానికీ.. రాజకీయాల్లో రాణించడానికీ.. సమయం, అవకాశాలూ ఆయనకి వున్నాయ్.
డబ్బులు కూడా బాగానే వున్నాయట.! అసెంబ్లీకి పోటీ చేస్తే, అవసరమైన మేర ఖర్చపెట్టగలడట కూడా. ‘ఏ పార్టీలోకి వెళ్ళినా టిక్కెట్ వస్తుంది..’ అని చెప్పుకుంటున్నాడట ఆయన. అన్ని డబ్బులుంటే, ఎంచక్కా మంచి హిట్టు సినిమా స్వీయ దర్శకత్వంలో నిర్మించొచ్చు కదా.? అని సలహాలు ఇస్తున్నారట సదరు దర్శకుడికి సినీ పరిశ్రమలో కొందరు.
ప్రస్తుతం ఆయా రాజకీయ పార్టీలతో నేరుగా చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నారట. సన్నిహితుల ద్వారా, ఆయా పార్టీల నుంచి తన పోటీ విషయమై సమాచారం తెప్పించుకున్న సదరు దర్శకుడు, ఈసారి నేరుగా రంగంలోకి దిగాడని అంటున్నారు. చర్చలు అన్నీ, హైద్రాబాద్ కేంద్రంగానే జరుగుతున్నాయట.
కానీ, పోటీ చేసేదేమో ఆంధ్రప్రదేశ్ నుంచి.! జనసేనానితో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయ్ కదా.? జనసేనలోనే చేరొచ్చు కదా.? అంటే, టీడీపీ – జనసేన పొత్తు ఖరారైతే, ‘జనసేన నుంచే పోటీ చేయాలనుకున్నా..’ అని అంటున్నాడట ఆయన. ప్రస్తుతానికైతే, వైసీపీ మీద కర్చీఫ్ వేశాడని అంటున్నారు.
టీడీపీ మీద కూడా ఇంకో కర్చీఫ్ వేశాడనీ, జనసేనలో తనకెప్పుడూ టిక్కెట్ సిద్ధంగా వుంటుందనీ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడట. ఎవరా దర్శకుడు ఏమా కథ.? అది ఇప్పటికైతే సస్పెన్స్.!