సత్తెనపల్లిలో కోడెల వర్ధంతి జరగనుందా! పోలీసులు -కోడెల అభిమానుల మధ్య వార్

ఏపీలో పోలీసుల వ్యవహారం చాలా వింతగా కనిపిస్తుంది. పోలీసులు కూడా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీ నాయకులు మీటింగ్స్ నిర్వహించినా లేక పార్టీ కార్యక్రమాలు నిర్వహించినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు కానీ టీడీపీ నేతలు చిన్న మీటింగ్ పెట్టుకున్నా కూడా కరోనా నిబంధాలను ఉల్లంఘించారని నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పుడు కోడెల శివ ప్రసాద్ వర్ధంతి విషయంలో కూడా అధికారులు దురుసుగా వ్యవహరించారు.

కోడెల శివ ప్రసాద్ వర్ధంతి వేడుకలు నిర్వహించకూడదని కోడెల శివరాంకు పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. కరోనా సమయం కాబట్టి కార్యక్రమం నిర్వహించకూడదని పోలీసులు వెల్లడించారు.

సత్తెనపల్లి,నర్సరావు పేట నియోజకవర్గాల్లో పలు చోట్ల కోడెల అభిమానులు కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు కోవిడ్ నిబంధనలు గుర్తు చేస్తూ నోటీసులు జారీ చేశారు. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని అందులో హెచ్చరించారు. నిర్వహించబోతోంది పార్టీ కార్యక్రమం కాదని..కేవలం తన తండ్రి మొదటి వర్ధంతని కోడెల శివరాం చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో పోలీసులు ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే.. కార్యక్రమాలు ఆపబోమని కోడెల శివరాం ప్రకటించారు. కోడెల వ్యాఖ్యల అనంతరం సత్తెనపల్లి, నర్సారావు పేట నియోజక వర్గాల్లో పరిస్థితులు వేడెక్కాయి. ఎలాంటి గొడవలు జరగకుండా ఉండటానికి అధికారులు అన్ని జాగ్రత్తులు తీసుకున్నారు. ఈ రెండు నియోజక వర్గాల్లో ఈరోజు ఏమి జరుగుతుందోనని రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ప్రభుత్వం పెట్టిన కేసుల వల్లే కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్న ఆయన అభిమానులకు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.