ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వ పాలనపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత డేవిడ్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అరాచక పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ప్రజలు నమ్మి ఓట్లు వేసి మోసపోయామని బాధపడుతున్నారు అని అన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ డేవిడ్ రాజుతో భేటీ అయ్యారు. టీడీపీలో చేరేందుకు సిద్ధమని ప్రకటించారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రజా బద్ద పరిపాలన రావాల్సిన అవసరం ఉందన్నారు.
తన కుమారుడితో కలిసి టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నామని, గతంలో తెలుగు దేశం పార్టీ అభివృద్దికి పని చేశానని, తన వల్ల మధ్యలో కొన్ని పొరపాట్లు జరిగాయన్నారు. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్దమన్నారు. కొద్దిరోజులుగా వైఎస్సార్‌సీపీపై డేవిడ్ రాజు అసంతృప్తిగా ఉన్నారు. తనకు సముచిత స్థానం ఇవ్వడం లేదని .. ఒంగోలులో తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు.
పాలపర్తి డేవిడ్ రాజు 1999లో సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరి యర్రగొండపాలెం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు. మళ్లీ 2019 ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోవడంతో తిరిగి వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ లో కి జాయిన్ కావడానికి సిద్ధమైయ్యారు.