ఏపీలో కొన్ని నెలల క్రితం వరకు ప్రశాంత వాతావరణం ఉండేది. అయితే పల్నాడు ప్రాంతంలో చోటు చేసుకుంటున ఘటనలు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి. టీడీపీ వాళ్లే దాడులు చేశారని వైసీపీ వాళ్లకు గాయాలయ్యాయని సమాచారం అందుతోంది. పల్నాడు అభివృద్ధి దిశగా వైసీపీ అడుగులు వేస్తున్న నేపథ్యంలో టీడీపీ అల్లర్ల ద్వారా ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తుండటం గమనార్హం.
టీడీపీ ప్రభుత్వం అడుగడుగునా ఆవాంతరాలు సృష్టిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని టీడీపీ భావిస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్లానింగ్ ద్వారానే ఇవి జరుగుతున్నాయని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉన్నా రాష్ట్రానికి జరిగిన అభివృద్ధి శూన్యమనే సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో టీడీపీపి ఆశాజనకంగా పరిస్థితులు లేకపోవడం వల్లే చంద్రబాబు నాయుడు ప్రజల దృష్టిని మరల్చే దిశగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఏపీలో విద్యావంతుల జాబితా అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల టీడీపీకి వచ్చే ఎన్నికల్లో 20 సీట్లు కూడా రావడం కష్టమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నవాళ్లను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు చేయడం ద్వారా ప్రజలకు మరింత దూరం అవుతారే తప్ప దగ్గర కాలేరని కొంతమంది నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ కామెంట్ల గురించి టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.