చంద్రబాబుని తిట్టిన ప్రతీ ఒక్కరూ ఇప్పుడు పొగుడుతున్నారు…. !

Chandrababu naidu

తెలుగుదేశం పార్టీ .. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో కొనసాగుతుంది. అయితే , టీడీపీ పెట్టినప్పటి నుండి చరిత్ర చూడని ఘోర పరాజయం చవి చూడటం తో చాలామంది టీడీపీ నేతలు సైలెంట్ అయ్యారు. కనీసం ప్రభుత్వ వ్యవహార తీరుపై ఆ నేతలు నోరు మెదపకుండా వచ్చారు. అయితే అదంతా నిన్న మొన్నటి మాట ..నేడు టీడీపీ నేతలు వైసీపీ విమర్శలు చేయడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. దీనికి ప్రధాన కారణం వైసీపీ లోని కీలక నేతలు సైతం సీఎం జగన్ ,నాయకులు ప్రభుత్వ తీరుపైనా బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు.

 CAG report on Chandrababu Naidu's debts

అలాగే , చంద్రబాబు సైతం ఒక్కొక్కరిని కలుపుకుంటూ పోతూ వివిధ కమిటీల పేరుతో పెద్ద ఎత్తున పదవులను భర్తీ చేయడం, యువ నాయకులకు పెద్ద పీట వేయడంతో నాయకుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. దీనితో ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనితో చంద్రబాబు నాయుడు కూడా కొత్త ఆనందంతో కనిపిస్తున్నారు. మళ్లీ రాజకీయాల్లో ఫుల్ యాక్టీవ్ గా కనిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే .. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే చంద్రబాబు జమిలి ఎన్నికలు రాబోతున్నాయని, పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలి అంటూ పలుసార్లు చెప్తూ వచ్చారు. జమిలి ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ పై నిత్యం ప్రజా పోరాటం చేస్తూ, ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా చేయాలని చెప్పడంతో క్యాడర్ లో కొంత అసంతృప్తి వచ్చింది అనేది వాస్తవం.

ఎన్నికలు జరిగి ఏడాది కూడా కాకుండానే జమిలి ఎన్నికలు అంటూ బాబు అనవసరంగా ఉన్న ఇమేజ్ ను కూడా పాడు చేస్తున్నాడు అంటూ కొంచెం అసహనం వ్యక్తం చేసేవారు. కానీ ,జమిలి ఎన్నికల్ ప్రస్తావన కేంద్ర బిజెపి పెద్దలు, ప్రధాని నరేంద్రమోదీ వంటివారు తీసుకురావడం, 2022లో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు చేస్తుండడం వంటి పరిణామాలను చూస్తూ అరెరే బాబు ముందుచూపుని ఎంత అపార్థం చేసుకున్నాము అంటూ తెలుగు తమ్ముళ్లు మధన పడుతూ రెట్టింపు ఉత్సహంతో ముందుకుసాగుతూ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పని చేస్తున్నారు.