ఆశ ఉండడం తప్పు కాదు గాని , మరి అత్యాశకు పోతే ఎక్కడలేని తిప్పలు పడాల్సి వస్తుంది. రాజకీయాల్లోనూ ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం బిజెపి వైసీపీ పార్టీ లు అంతో ఇంతో స్నేహంగానే ముందుకు వెళ్తున్నాయి. ఒకరికొకరు అన్ని విషయాల్లోనూ సహకరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ ఒక్క విషయంలో రెండు పార్టీల మధ్య రాజకీయ పరమైన ఇబ్బందులు ఉండడంతో , ఎవరికి వారు తమ పంతం నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కొన్ని అభిప్రాయ భేదాలు ఈ రెండు పార్టీల మధ్య తలెత్తుతున్నాయి. వాటిని కూడా తమకు అనుకూలంగా మార్చుకుని రాజకీయంగా పై చేయి సాధించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఇక్కడ చర్చనీయాంశం అవుతోంది. మూడు రాజధానులు , సీఆర్డీఏ రద్దు, ఏపీకి కొత్త ఎన్నికల కమిషనర్ ఇలా వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా , జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నా, కేంద్రం ఏ విషయాలను పెద్దగా తెలుసుకునేందుకు ప్రయత్నించలేదు .
పైగా చాలా విషయాల్లో వైసీపీ ప్రభుత్వానికి సహకరిస్తూనే వచ్చింది.అయితే చాలా కాలంగా బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీకి బిజెపి వైసిపి స్నేహం గా కొనసాగుతుండడం ఏ మాత్రం ఇష్టం లేదు. ఏదో రకంగా ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తక పోతాయా , రాజకీయంగా తాము ఎప్పటికైనా పై చేయి సాధించకపోతామా , బీజేపీతో ఒత్తు పెట్టుకోకపోతామా అనే వేచ చూస్తోంది. సరిగ్గా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు రావడం , పోలవరం ప్రాజెక్టు కు సంబంధించి నిధుల విషయమై కేంద్రాన్ని వైసీపీ ప్రభుత్వం నిలదీసే అవకాశం ఉండడంతో, టిడిపి ఆశగా ఎదురుచూస్తోంది. ఒకవేళ కేంద్రంతో జగన్ విభేదిస్తే క్రమంగా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు రద్దు అవుతుందని, టిడిపి అంచనా వేస్తోంది. ఒకవేళ బీజేపీ తో కనుక వైసీపీ లాలూచీ పడితే రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెడుతున్నారని , ఏపీ అభివృద్ధి విషయంలో ఆయనకు చిత్తశుద్ధి లేదు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లి జగన్ ను టార్గెట్ చేసుకోవాలని, అయితే ఎక్కడా కేంద్రాన్ని ఇందులోకి లాగకుండా, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని బాబు అభిప్రాయపడుతున్నట్లు కనిపిస్తోంది.
ఇప్పటికే కేంద్ర బిజెపి పెద్దలతో టచ్ లో ఉంటున్న బాబు వైసీపీ బీజేపీ మధ్య కనుక వైరం మొదలయితే పొద్దు విషయమై గట్టిగా పట్టుబట్టాలని ఏదోరకంగా బిజెపి ని ఒప్పించి ఆ పార్టీతో చేయాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు. అయితే కేవలం ఒక పోలవరం ప్రాజెక్టు విషయం తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ ఒకరికొకరు సహకరించుకుంటూ పొత్తు పెట్టుకున్న వీరు తెగతెంపులు చేసుకునే వరకు పరిస్థితి రాదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ విషయంలో చంద్రబాబు అతిగా ఆలోచిస్తున్నారనే అభిప్రాయాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.