తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి స్టార్ కాంపైనర్ విజయ శాంతి స్పష్టమైన వ్యూహంతోనే ముందుకు వెడుతున్నట్టు తెలుస్తుంది . రాబోయే ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ఓ సవాలుగా తీసుకుంది . తెలంగాణ రాష్ట్రము తాము ఇస్తే ఆవిషయాన్ని చెప్పకుండా చంద్ర శేఖర్ రావు అది తన కృషిగానే చెప్పుకొని ప్రజలను మభ్య పెడుతున్నాడని , ఎలాగైనా కేసీఆర్ ను పదవిలోకి రాకుండా చెయ్యాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం గా కనిపిస్తుంది . అందుకే కాంగ్రెస్ పార్టీ తన శక్తి యుక్తులను ఉపయోగిస్తుంది .
చాలా కాలంగా విజయ శాంతి చంద్ర శేఖర్ రావు పై పగ తీర్చుకోవడాని అవకాశం కోసం ఎదురు చూస్తుంది . ముందస్తు రావడంతో విజయ శాంతి తన ప్రచారాస్త్రాలను బయటకు తియ్యబోతున్నారు . తెలంగాణ అంటే తనకు ఎప్పటి నుంచో తనకు అభిమానమని అందుకే సినిమా కెరియర్ ను కాదనుకొని 1998లోనే తానూ “తల్లి తెలంగాణ ” పార్టీని ప్రారంభించానని , అప్పటికి చంద్ర శేఖర్ రావుకు ఆ ఆలోచన కూడా లేదని విజయ శాంతి వాదన. అయితే చంద్ర చంద్ర శేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించిన తరువాత ఐక్య వేదిక మీదకు వచ్చి పోరాడాలని నిర్ణయించుకొని టీఆరెస్ పార్టీలోకి రావడం జరిగింది చెబుతుంది .13 సంవత్సరాలు పోరాటం చేసిన తరువాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై 2013లో ప్రకటన వచ్చిందని , ఆతరువాత ఆ తరువాత తన కూతురు కవిత కోసం తనని సాగనంపటానికి చంద్రశేఖర్ రావు పొగపెట్టాడని విజయ శాంతి నమ్ముతుంది . అందుకే తెలంగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని అంటున్నది .
తెలంగాణ ప్రజల ఆశలు పట్టించుకోలేదని, చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదని , తెలంగాణను తన కుటుంబ ఆస్తిగా ఆయన భావిస్తున్నాడని , అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే అర్హత చంద్ర శేఖర్ రావుకు లేదని , అందుకే ఆయన్ని సాగనంపడానికి కంకణం కట్టుకున్నానని అంటున్నది .
చంద్ర శేఖర్ రావును లక్యం చేసుకున్నానని అందుకే తనను ఎన్నికల్లో పోటీ చేయమని ఒత్తిడి వచ్చినా సున్నితంగా తిరస్కరించానని చెబుతున్నది. తెలంగాణ మారుమూల ప్రాంతాలలో సైతం పర్యటించి కేసీఆర్ నిజ స్వరూపం ప్రజలకు తెలియ జేస్తానని విజయ శాంతి “రాములమ్మ “లా శపథం చేసింది .
విజయ శాంతి అంటే తెలంగాణా ప్రజల్లో మంచి అభిమానం వుంది . ఈ అభిమానం ఓట్లుగా మారితే … టీఆరెస్ కు ప్రమాదమే !