మల్లారెడ్డి కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్ధిని మృతి

మేడ్చల్ లోని మైసమ్మ గండిలోని నల్లామల్లారెడ్డి కాలేజిలో ఆత్మహత్యాయత్నానికి యత్నించిన విద్యార్దిని సంధ్య చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం చనిపోయింది. జగిత్యాల జిల్లాకు చెందిన సంధ్య కాలేజిలో ఇంజనీరింగ్ చదువుతూ హాస్టల్ లో ఉంటుంది.

చికిత్స పొందుతూ చనిపోయిన సంధ్య

బుధవారం రాత్రి సంధ్య రూములోని మరో అమ్మాయి కి సంబంధించన నగదు మాయమైంది. దీంతో ఆ అమ్మాయి వార్డెన్ కు ఫిర్యాదు చేయగా సంధ్యే తీసిందని వార్డెన్, ఆ అమ్మాయి అవహేళనగా మాట్లాడటంతో మనస్తాపానికి గురైన సంధ్య గురువారం ఉదయం హాస్టల్ 4 వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా ఆదివారం ఉదయం చనిపోయింది.  

సంధ్య కిందకు దూకింది ఈ బిల్డింగ్ నుంచే

వాస్తవానికి సంధ్య శనివారం మధ్యాహ్నమే చనిపోెయిందని ఈ విషయం చెప్పకుండా ఆసుపత్రి వారు, కళాశాల యాజమాన్యం గాంధీ ఆస్పత్రికి తరలించారు.అంత రహస్యంగా తరలించాల్సిన అవసరమేముందని సంధ్య బంధువులు ప్రశ్నిస్తున్నారు. సంధ్యా ఆత్మహత్య పై తమకు అనుమానాలున్నాయన్నారు. కళాశాల సిబ్బంది సిసి ఫుటేజి మాయం చేశారన్నారు. సంధ్యను తోటి విద్యార్దులు, వార్డెనే హాస్టల్ పై నుంచి తోసేశారని వారు ఆరోపించారు.  

కాసుల కక్కుర్తి కోసం పిల్లల ప్రాణాలతో ఆటలాడుతున్నారని పలువురు విమర్శించారు. మల్లారెడ్డి యాజమాన్యం అధికార మదంతో సాక్ష్యాలన్నీ తారుమారు చేసిందని విద్యార్ది సంఘాల నాయకులు విమర్శించారు. మల్లారెడ్డి కళాశాలలో అనేక అక్రమాలు, విద్యార్ధులపై వేధింపులు జరుగుతున్నాయన్నారు. అధికార దర్పంతో అవన్నీింటిని చీకటిలోనే సమాధి చేస్తున్నారన్నారు. 

జగిత్యాల జిల్లాకు చెందని భూమారెడ్డి కుమార్తె సంధ్యారాణి. అర్ధాంతరంగా కూతురు చనిపోవడంతో  తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. విద్యార్ధిని ఆత్మహత్యాయత్నానికి కారణమైన వార్డెన్ ను సస్పెండ్ చేయాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేశాయి. ఇంత జరిగినా కళాశాల యాజమాన్యం తమకేమి పట్టనట్టు ఉండటం దారుణమన్నారు. ఎక్సగ్రేషియా ప్రకటించి విద్యార్ధిని కుటుంబానికి న్యాయం చేయాలన్నారు.