Chandra Babu: 2024 ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూటమి ప్రభుత్వం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఏకంగా 164 స్థానాలలో విజయం అందుకున్నారు ఇక కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆంక్షలతో ప్రజలు కూడా భారీ మెజారిటీతో గెలిపించారు. ఈ క్రమంలోనే ఆరు నెలల పాలన పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఎలక్షన్ అనలిస్టు చంద్రబాబు ఆరు నెలల పాలనపై తన రివ్యూ ఇచ్చారు.ప్రభుత్వం ఎన్నికల్లో ఓటర్లు తమకు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా పనిచేస్తోందా ?
భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయి. ? వాటిని అందుకోవడంలో ప్రభుత్వం సక్సెస్ అయిందా విఫలమైందా ? ఇదే అంశంపై గత ఎన్నికల్లో సర్వేలతో పాటు రాజకీయ విశ్లేషణలు చేసిన అనలిస్ట్ ప్రవీణ్ పుల్లట తాజాగా ఎక్స్ లో ఓ పోస్టు చేశారు. ఈ పోస్టులో భాగంగా ఈయన నిర్మొహమాటంగా చంద్రబాబు పని తీరుపై చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతుంది.
చంద్రబాబు నాయుడు పాలనపై ప్రవీణ స్పందిస్తూ ప్రజలు ఇంతటి భారీ విజయాన్ని కూటమి ప్రభుత్వానికి కట్టబెట్టిన ఏ ఒక్క వర్గం వారు సంతోషంగా లేరని తెలిపారు. ప్రజలు ఎక్కువగా ఆశిస్తున్నారా? లేదా పైవారు బలహీనంగా ఉన్నట్లా? అని సందేహాలు కూడా వ్యక్తం చేశారు. ఇలా ప్రజలు సంతోషంగా లేకపోవటానికి గల కారణాలను కూడా ఈయన తెలియజేశారు.
సంక్షేమ పథకాల అమలులో ఆలస్యం, నామినేటెడ్ పోస్టుల భర్తీలో అలాగే అధికారుల బదిలీలలో అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.. అని ప్రవీణ్ తెలిపారు. బాబూ..మీరేనా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది అని సాక్షాత్తూ తమ్ముళ్లే ప్రశ్నిస్తున్నారు సర్.. అంటూ ఆరు నెలల పాలన పై కూటమి ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తూ ఈయన చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది మరి ఈ పోస్ట్ పై కూటమి నేతలు ఎలాంటి స్పందన తెలియజేస్తారా లేదా ఇకపై తమ ధోరణినీ మార్చుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.
ఇంతటి భారీ విజయం దక్కిన తర్వాత ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదు..ఎందుకని?
ప్రజలు ఎక్కువగా ఆశిస్తున్నారా? లేదా పైవారు బలహీనంగా ఉన్నట్లా?సంక్షేమ పథకాల అమలులో ఆలస్యం, నామినేటెడ్ పోస్టుల భర్తీలో అలాగే అధికారుల బదిలీలలో అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.. బాబూ..మీరేనా…
— Praveen Pullata (@praveenpullata) December 18, 2024