కృష్ణా జిల్లా వైసిపికి షాక్ (వీడియో)

కృష్ణా జిల్లా నూజివీడు మునిపల్  కౌన్సిల్ కు చెందిన ఎనిమిది మంది  వైఎస్సార్ పార్టీ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా  చేశారు. మునిసిపల్ ఛెయిర్మన్ పదవిరోటేషన్ మీద వివాదం రావడంతో రాజీ కుదరకు వీరంతా రాజీనామా చేశారు. గతంలో కౌన్సిలర్ల మధ్య ఛెయిర్ పర్సన్ పోస్టు మీద ఒప్పందం కుదిరింది.  మున్సిపాలిటీ చైర్మన్ పదవీ ఒప్పందం ప్రకారం మొదట 3సంవత్సరాలు బసవా రేవతి చెయిర్ పర్సన్ గా ఉండాలి.  ఆ పైన మిగిలిన 2 సంవత్సరాలు రామిశెట్టి త్రివేణీ దుర్గ  పదవి దక్కాలి. అయితే, ఆమోదంచినట్లుగా పదవీ కాలం ముగిసినప్పటికీ ఛెయిర్ పర్సన్ సీటు ఖాళీ చేసేందుకు  బసవా రేవతి తిరస్కరించింది. ఆమె   చైర్మన్ సీటు దిగక పోవటంతో వైసిపిలో విబేధాలు చెలరేగాయి. .
స్థానిక శాసన సభ్యుడు మేకా ప్రతాప్ సమక్షంలో రెండు వర్గాలతో జరిపిన చర్చలు జరిగాయి. ఇరువర్గాలను రాజీ చేసేందుకు ఆయన చేసిన కృష్టి ఫలించ లేదు. రేవతి పదవి వదిలేయాల్సిందేనని దుర్గ వర్గం పట్టుబట్టింది. ఆమెకు ఎడుగురు కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. మొత్తంగా  రామిశేట్టి త్రివేణీదుర్గతో కలిపి  8 మంది కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేశారు.