లుకౌట్ నోటీసు జారీ..సుజనాకు షాక్..చంద్రబాబులో టెన్షన్

కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరికి కేంద్రం తాజాగా పెద్ద షాకే ఇచ్చింది. ఆర్దిక లావా దేవీలకు సంబంధించిన ఆరోపణలపై సుజనా ఇళ్ళు, కార్యాలయాలపై ఈడి ఉన్నతాధికారులు సోదాలు జరుపుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి మొదలైన సోదాలు ఇంకా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సుజనాపై ఈడి లుకౌట్ నోటీసు జారీ  చేయటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మామూలుగా అయితే దేశం వదిలి పారిపోయే అవకాశం ఉన్నట్లు అనుమానం వచ్చినా, లేదా ఎవరికీ కనిపించకుండా హైడవుట్ లోకి వెళ్ళిపోయినా లుకౌట్ నోటీసు జారీ  చేస్తారు. అలాటంది సుజనా పై లుకౌట్ నోటీసు ఎందుకు జారీ చేసిందో అర్దం కావటం లేదు.

 

కార్పొరేషన్ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకు, సెంట్రల్ బ్యాంకు నుండి సుమారు 304 కోట్ల రూపాయలు తీసుకుని ఎగొట్టారనే ఆరోపణలున్నాయి.  అలా ఎగొట్టిన మొత్తాన్ని సుజనా షెల్ కంపెనీలు పెట్టి అందులోకి మళ్ళించారని ఆరోపణలున్నాయి. తన ఉద్యోగులను షెల్ కంపెనీలకు డైరెక్టర్లుగా చూపిస్తున్న విషయం బయటపడింది.  ఆ విషయం మీదే తాజాగా ఈడీ దాడులు జరిగాయి. సోదాల్లో కీలకమైన పత్రాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.  సుజనా కు చెందిన లగ్జరీ కార్లను కూడా అధికారులు సీజ్ చేయటం గమనార్హం. ఆర్ధిక అవకతవకల ఆరోపణలపై సుజాను మీద సిబిఐ ఎప్పుడో ఎఫ్ ఐఆర్ నమోదు చేసుంది. ఇదే విషయమై గతంలో నాంపల్లి కోర్టు సుజనా కేంద్రమంత్రిగా ఉన్నపుడే నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు కూడా జారీ చేసింది.

 

సరే, నాన్ బెయిల్ బుల్ అరెస్టు వారెంటు జారీ చేయటం, కేంద్ర  దర్యాప్తు సంస్దలు దాడులు, విచారణ చేయటం మామూలు. కానీ తాజాగా లుకౌట్ నోటీసు జారీ చేయటమంటే వ్యవహారం తేడాగా ఉంది. నోటీసులు జారీ చేయటం, కార్లను స్వాధీనం చేయటం లాంటివి గతంలో ఎన్నడూ చేయలేదు. ఇపుడు ఆ పని చేశారంటే బహుశా త్వరలో అరెస్టు కూడా ఉంటాయేమోనని టిడిపి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జరుగుతున్న వ్యవహారాలపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్న చంద్రబాబు అండ్ కోలో టెన్షన్ పెరిగిపోతోంది.