బీజేపీ – జనసేన పొత్తుపై స్పందించిన సుజనా… కన్ ఫ్యూజన్ లో సైనిక్స్!

ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నట్లు అనిపిస్తున్నా.. పార్టీలు చేస్తున్న హడావిడి చూస్తుంటే ఎన్నికలు ఈ ఏడాదే వచ్చేస్తాయేమోననే అనుమానం వ్యక్తపరుస్తున్నారు పరిశీలకులు! ఒకవైపు ప్రతిపక్షం దూకుడు, మరోవైపు జగన్ పర్యటనలు వెరిసి ముందస్తుపై కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే… టీడిపీ – జనసేన పొత్తు పంచాయతీపై మాత్రం క్లారిటీ రావడం లేదని అంటున్నారు పరిశీలకులు. అయితే తన వంతుగా ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చేపనికి పూనుకున్నారు సుజనా చౌదరి.

రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని గట్టిగా చెబుతున్నారు పవన్ కల్యాణ్. అంటే… టీడీపీ – జనసేన పొత్తులో పోటీచేస్తాయని కన్ ఫాం చేశారు! అయితే… ఇప్పటికే మిత్రపక్షంగా ఉన్న బీజేపీ పెద్దలు మాత్రం… జనసేన – బీజేపీ కలిసి పోటీచేస్తాయి.. ఇది పక్కా.. అని కన్ క్లూజన్ ఇస్తున్నారు. అయితే తాజాగా అటు టీడీపీకి, ఇటు బీజేపీకీ కూడా చాలా కావాల్సిన మనిషిగా పేరున్న ఏపీ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి పొత్తులపై స్పందించారు.

తాజాగా బీజేపీ – జనసేన పొత్తులపై స్పందించిన సుజనా చౌదరి… పొత్తుల పై బీజేపీ అధిష్ఠానంతో పవన్ కల్యాణ్ చర్చలు జరిపారని.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ – జనసేన పార్టీలు పొత్తుతోనే ముందుకు సాగుతున్నాయని క్లారిటీ ఇచ్చారు. దీంతో మరోసారి పొత్తులపై కన్ ఫ్యూజన్ స్టార్ట్ అయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే బీజేపీతో పొత్తు కోసం తాము వెంపర్లాడటం లేదని ఇప్పటికే లోకేష్ స్పందించారు. దీంతో… ఈ విషయాలపై అందరికంటే ముఖ్యంగా స్పందించాల్సిన పవన్ కూడా స్పందించేస్తే… ఏపీలో పొత్తులపై ప్రజలకు, కార్యకర్తలకూ ఒక క్లారిటీ వస్తుందని సూచిస్తున్నారు విశ్లేషకులు. అలాకానిపక్షంలో… ఏపీలో అందరికంటే ముఖ్యంగా జనసేన కార్యకర్తలు కావాల్సినంత కన్ ఫ్యూజన్లో ఇప్పటికే కొట్టిమిట్టాడుతున్న నేపథ్యంలో.. వారు మరింత కన్ ఫ్యూజన్ లోకి వెళ్లే ప్రమాధం లేకపోలేదు.