ఏపీ పంచాయతీ ఎన్నికలకు గుర్తులు విడుదల చేసిన ఈసీ !

Panchayat elections: AP people do not want.?

ఆంధ్రప్రదేశ్ లో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ చివరి దశ‌కు వచ్చింది. అభ్యంతరాల స్వీకరణ, నామినేషన్ల ఉపసంహరణ మాత్రమే మిగిలింది.. ఆ ప్రక్రియ పూర్తైన తర్వాత ఈ నెల 9న ఎన్నికలు జరగనున్నాయి. అయితే తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కేటాయించే గుర్తులను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది.

Panchayat Elections: AP CEO directs collectors to Print the ballot papers  by December 15

ఈసారి సర్పంచ్ అభ్యర్థులకు 25, వార్డు సభ్యులకు 20 గుర్తులను కేటాయించారు. వీటిని జిల్లాల అధికారులకు పంపించారు.. తొలిసారి అభ్యర్థుల జాబితాలో చివర నోటా గుర్తు ఉంటుంది. సర్పంచి అభ్యర్థుల గుర్తుల విషాయానికి వస్తే.. గొలుసు, కుర్చీ, బ్యాట్‌, మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, కొవ్వొత్తులు, నల్లబోర్డు, కప్పుసాసరు, క్యారెట్‌, తాళం చెవి, మొబైల్, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్షపళ్లు, తిరగలి, కుండ, అరటిపండు, అనాసపండు, షటిల్‌, చేతికర్ర, చెంచా గుర్తులను అభ్యర్థులకు కేటాయిస్తారు.

వార్డు సభ్యుల గుర్తులు ఇలా ఉన్నాయి.. వారికి ప్రెషర్‌ కుక్కర్‌, గౌను, స్టూలు, బీరువా, ఐస్‌క్రీమ్‌, కెటిల్‌, ఇస్త్రీపెట్టె, పోస్టుడబ్బా, గ్యాస్‌ పొయ్యి, కటింగ్‌ప్లేయర్‌, గరిట, విద్యుత్‌స్తంభం,బెండకాయ, బెల్టు, కోటు, డిష్‌ యాంటెన్నా, రంపం, కెమెరా, క్యారంబోర్డు, వయొలిన్‌ గుర్తులు కేటాయించారు.