వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని దాదాపు వివాదాలు రేపుతున్నాయి. ఎన్నికల కమిషినర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద దూమరాన్నే రేపింది. తనను విధుల నుండి తొలగిస్ట్ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిమ్మగడ్డ కోర్ట్ లో సవాల్ చేసి తిరిగి విధుల్లో చేరారు. విధుల్లో చేరిన తరువాత ఆయన వైసీపీ నాయకులు చేస్తున్న పనులపై మరింత శ్రద్ధ పెట్టారు. ప్రభుత్వం నుండి వస్తున్న ప్రతి అడ్డంకిని నిశితంగా పరిశీలిస్తున్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన చాలారోజుల పాటు మౌనంగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి ప్రభుత్వ తీరుపై మరోసారి హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిబ్బందిని ప్రభుత్వం వేధిస్తుందని, ఎన్నికల కమిషన్ విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
అయితే ఇప్పుడు ఈ పిటిషన్ వేయడం వెనక చాలా ముందుచూపు ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. భవిష్యత్ లో ఒక స్వయం నియంతృత్వ సంస్థ యొక్క అధికారిగా తాను తీసుకునే నిర్ణయాలకు ప్రభుత్వం అడ్డు చెప్పకూడదనే ఉద్దేశంతోనే ఈ పిటిషన్ దాఖలు చేశారని సమాచారం. అలాగే గతంలో తాను సస్పెన్షన్ కు ఆదేశాలపై ప్రభుత్వం ఇప్పటికి వరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని సీఎస్ కు కూడా రమేష్ లేఖ రాయనున్నారని సమాచారం. గతంలో జరిగిన స్థానిక ఏకగ్రీవాలను కూడా రద్దు చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే గత గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎన్నికల నిర్వహణకు ముందుగానే స్థానిక అధికారులు సమీక్ష చేసేలా కూడా కోర్ట్ నుండి సంకేతాలు పంపున్నారని సమాచారం. విచారణ నిమిత్తం గతంలో అధికారులు స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్స్ ను తిరిగి ఇప్పించాలని కూడా కోర్ట్ ను కొరబోతున్నారు. నిమ్మగడ్డ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వైసీపీ ప్రభుత్వం మరోసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రూపంలో ఇబ్బందులు ఎదురు కానున్నాయి.