చంద్రబాబుకు ఈసి షాక్

చంద్రబాబునాయుడుకు ఎలక్షన్ కమీషన్ షాక్ ఇచ్చింది. రాబోయే ఎన్నికలను ఈవిఎంల పద్దతిలోనే నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరా తేల్చిచెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో పోలింగ్ ను ఈవిఎంలకు బదులు పేపర్ బ్యాలెట్ ద్వారానే జరపాలంటూ సాంకేతిక పరిజ్ఞాన పితామహుడు చంద్రబాబునాయుడు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. పోలింగ్ కు ఈవిఎంలను వాడాలని తానే భారత ప్రభుత్వానికి చెప్పానంటూ గతంలో చంద్రబాబు పెద్ద బిల్డప్ ఇచ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటిది రాబోయే ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్టే వాడాలని చంద్రబాబు ఎందుకంతగా పట్టుబడుతున్నారు ?

ఎందుకంటే, గెలుపుపై నమ్మకం లేకే అని అర్ధమైపోతోంది. నాలుగున్నరేళ్ళ పాలనలో తెలుగుదేశంపార్టీపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత కనబడుతోంది. ఆ వ్యతిరేకతను అడ్డుకుని మళ్ళీ గెలవాలంటే చంద్రబాబుకు ఏ మార్గము కనబడటం లేదు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతే తన పరిస్ధితేంటో చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకనే పురాతన కాలంలో పద్దతి పేపర్ బ్యాలెట్ నే తిరిగి వాడుకలోకి తేవాలంటూ పదే పదే డిమాండ్ చేశారు. మొన్నటి కలకత్తా ర్యాలీ, బహిరంగసభలో కూడా ఎలక్షన్ కమీషన్ ను చంద్రబాబు ఇదే డిమాండ్ చేశారు.

మొన్నటి నంద్యాల ఉపఎన్నికలో కూడా ప్రతిపక్షం వైసిపి పోలింగ్ ఏజెంట్లను మ్యానేజ్ చేసుకుని గెలిచారు. ఆ పోలింగ్ ఏకపక్షంగా సాగింది కాబట్టి పోలింగ్ ఏ పద్దతిలో జరిగినా అనుకున్న ఫలితమే వచ్చింది. కానీ వచ్చేది సాధారణ ఎన్నికలు. అంటే నంద్యాలలో తాను అనుకున్నట్లు చేసుకోగలిగారు కానీ మొత్తం 175 నియోజకవర్గాల్లోను పోలింగ్ జరిగేటపుడు చంద్రబాబు పప్పులుడకవు. రిగ్గింగ్ ద్వారా ఓట్లేయించుకోవాలంటే ఈవిఎంల ద్వారా అంత ఈజీకాదు. అదే పేపర్ బ్యాలెట్ అయితే ఓపికను బట్టి తమిష్టం వచ్చినట్లు గుద్దుకోవచ్చని చంద్రబాబు అనుకుంటున్నారు. అందుకనే ఈవిఎంలు వద్దంటున్నారు. కానీ ప్రధాన ఎన్నికల కమీషనర్ చంద్రబాబు డిమాండ్ ను ఏమాత్రం ఖాతరు చేయలేదు. రాబోయే ఎన్నికలు ఈవిఎంలతోనే జరుగుతుందని తెగేసి చెప్పటంతో చంద్రబాబులో టెన్షన్ మరింత పెరుగుతోందట.