నోటా సినిమా రిలీజ్‌కు ఆటంకం

నోటా సినిమా విడుదల పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయాన ఈ సినిమా విడుదల చేస్త దాని ప్రభావం ఎన్నికల పై పడుతుందని తమిళనాడు తెలుగు యువత వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు.

నోటా సినిమా ట్రైలర్ తప్పుగా ఉందని, ఎన్నికల వేళ నోటా అనే ట్రైలర్ ఎలా వాడుతారని ప్రశ్నించారు. ఇది ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తుందని సినిమా విడుదలకు ముందే డిజిపి, ఈసీ  నోటా సినిమాను చూడాలని ఆయన ఈసీని కోరారు. నోటా సినిమా ఈ నెల 5 వతేదిన విడుదల కానుంది. కేతిరెడ్డి ఫిర్యాదుతో నోటా సినిమా విడుదల అవుతుందా లేక ఆగిపోయేనా అనే ఉత్కంఠ మొదలైంది.