కేసీఆర్ మౌనం వెనుక అసలు కారణాలివే.. ఆరోజే వెల్లడిస్తానంటూ?

తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ టీ.ఆర్.ఎస్ నుంచి బీ.ఆర్.ఎస్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ పెట్టడానికి గల కారణాలను వెల్లడిస్తూ కేసీఆర్ మీడియాతో మాట్లాడతారని అందరూ అనుకున్నా కేసీఆర్ మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ పార్టీ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో క్లారిటీ లేకపోవడంతో ఒకింత కన్ఫ్యూజన్ కు గురవుతున్నారని సమాచారం అందుతోంది.

అయితే పార్టీకి ఈసీ నుంచి గుర్తింపు కోసం కేసీఆర్ ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. ఈసీ నుంచి గుర్తింపు దక్కితే బీ.ఆర్.ఎస్ పార్టీ గురించి ఊహించని స్థాయిలో చర్చ జరుగుతుంది. ఆ సమయంలో పార్టీ గురించి మాట్లాడితే బాగుంటుందని కేసీఆర్ భావిస్తున్నారని బోగట్టా. తెలంగాణ ప్రజలకు బీ.ఆర్.ఎస్ పార్టీ గురించి కేసీఆర్ ఏం చెబుతారో చూడాల్సి ఉంది. కేసీఆర్ పార్టీ విషయంలో ఆలస్యం చేయడం కరెక్ట్ కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు పార్టీని ఇతర రాజకీయ నాయకులు పెద్దగా పట్టించుకోవడం లేదని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది. ఇతర పార్టీల నేతల నుంచి కేసీఆర్ కు ఆశించిన స్థాయిలో స్పందన రాని నేపథ్యంలో ఆయన భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది. మరోవైపు కేసీఆర్ కొంతమంది ఉత్తరాది నేతలను వరుసగా కలుస్తూ వాళ్లతో చర్చించారని సమాచారం అందుతోంది.

ఇతర ప్రాంతీయ పార్టీలను కలుపుకోవాలని కేసీఆర్ భావిస్తున్నా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల నేతలు కేసీఆర్ ను ఎంతవరకు నమ్ముతారో చూడాల్సి ఉంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కూడా సక్సెస్ సాధించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. కేసీఆర్ బీ.ఆర్.ఎస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తెచ్చేందుకు తన వంతు కష్టపడుతున్నారు.