వారాహి విషయంలో వాయిదాలొద్దు… ఫ్యాన్స్ ఫైనల్ వర్డ్ ఇదిగో!

ఇంకెంత వారాహి వచ్చేస్తుంది.. ప్రభుత్వ పెద్దలు రంగులపై అభ్యంతరాలు చెప్పకపోతే ఎప్పుడో వచ్చేసేది.. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు కూడా అయిపోయాయి ఇంక స్టార్ట్ ఐపోతుంది.. ప్రభుత్వ నిబంధనలకు తగ్గట్టు రంగులో కూడా మార్పులు అయిపోయాయి కాబట్టి ఇంక మంచిరోజు చూసుకుని బయలుదేరడమే.. ఇలా వారాహి టాపిక్ వచ్చిన ప్రతీసారీ జనసైనికులు తమకు తాము ధైర్యం చెప్పుకుంటున్నారు. అలా ఎవరికి వారు ఎంత ధైర్యం చెప్పుకుంటునా.. ఎక్కడో తెలియని ఆవేదన.. అవమానాలు – విమర్శలను ఎదుర్కోలేకపోతున్న పరిస్థితి! అయినా వారాహి పార్కింగ్ లోనుంచి బయటకు రావడం లేదు.. దీంతో ఈసారి సీరియస్ గా స్పందిస్తున్నారు జనసైనికులు!

అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు… అంటూ రాజకీయ ప్రత్యర్థులు వారాహిపై సెటైర్స్ వేస్తున్న బాద ఒకవైపు. వారాహి రంగు విషయంలో ప్రభుత్వం అభ్యంతరాలు చెబితే “మనల్ని ఎవడ్రా ఆపేది” అంటే… “చంద్రబాబు” అని సమాధానం సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్న ఆవేదన మరోవైపు.. ఈ అవమానాలకు బలం చేకూరుస్తూ.. వారాహి విషయంలో వాయిదాలే వాయిదాలు!

ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నతర్వాత సొంతంగా ఎదగాలని.. తనను నమ్మిన – తాను నమ్మిన జనాలకు రాజ్యాధికారం సాధించిపెట్టాలని ఎవరైనా భావిస్తారు. అంతేకానీ… ఒకరికి అండగా నిలిచి, వారిని ముఖ్యమంత్రిని చేయాలని ఎవరూ అనుకోరు. కానీ పవన్ మాత్రం అలానే చేస్తున్నారు. ఫలితంగా ఫ్యాన్స్ ను నిరాశపరుస్తున్నారు. సర్లే గతం గతః.. ఈసారి సింగంలా సింగిల్ గా వద్దాం.. అందులో భాగంగా వారాహిని స్టార్ట్ చేద్దామని ఫ్యాన్స్ భావించారు. దీంతో.. దసరాకు తన పర్యటను ప్రారంభిస్తానని జనసేనాని చెప్పారు. అయితే అది వాయిదా పడింది.

దసరా అయిపోయింది.. హోలీ వచ్చేసింది.. త్వరలో ఉగాది, అనంతరం శ్రీరామ నవమి… ఇలా పండగలు వస్తుంటాయి – పోతుంటాయి కానీ… పార్కింగ్ ప్లేస్ కదిలి వారాహి బయటకు రావడం లేదు. దీంతో… నారా లోకేష్ పాదయాత్ర ఒక కొలిక్కి వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు చంద్రబాబు పచ్చ జెండా ఊపుతారంటూ సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది. దీంతో… 14న జరగబోయే ఆవిర్భావ సభలో వారాహిపైనా – టీడీపీతో పొత్తుపైనా పూర్తి క్లారిటీ ఇవ్వాలని, అలాకానిపక్షంలో ఎన్నికలకు వెళ్లడం అనవసరమని సీరియస్ గా స్పందిస్తున్నారంట జనసైనికులు! స్పష్టత లేని అధినేత నిర్ణయాల ఫలితంగా… గ్రామాల్లో రాజకీయ అవమానాలు వారిని అలా వేదిస్తున్నాయి మరి!