Vijay Sai vs Bandla :సినీ నటుడు బండ్ల గణేష్ మాటకి అసలే హద్దూ అదుపూ వుండదు. అలాంటి బండ్ల గణేష్ మీద సెటైరేసి, తన స్థాయిని దిగజార్చేసుకోవాలని విజయ సాయి రెడ్డి ఎందుకు అనుకున్నారో.? సరిగ్గా చెప్పాలంటే, విజయ సాయి రెడ్డి తన గొయ్యి తానే తవ్వుకున్నట్లయ్యింది.
బండ్ల గణేష్ చేసిన విమర్శలపై విజయ సాయి లైట్ తీసుకుని వుంటే బాగుండేది. కానీ, తనకి అలవాటైన రీతిలో సెటైర్ వేసి, అడ్డంగా బుక్కయిపోయారు. విజయ సాయి రెడ్డి తనను కుక్కతో పోల్చడంపై బండ్ల మండి పడ్డాడు.
‘దొంగ సాయీ..’ అంటూ విరుచుకుపడ్డాడు.
‘అన్నం పెట్టి బతుకును ఇచ్చిన వారికి విశ్వాసంగా వుంటాను. అలా నేను కుక్కలా విశ్వాసం చూపుతానేమో. నీలా గజ్జికుక్కనీ, మోసపు కుక్కనీ కాదు దొంగ సాయి గారూ..’ అంటూ పేట్రేగిపోయాడు బండ్ల గణేష్.
ఆంధ్ర ప్రదేశ్ అనే ఉద్యానవనంలో మొలిచిన గంజాయి మొక్కగా విజయ సాయిరెడ్డిని అభివర్ణించడమే కాదు, తెలుగు వాడిగా ఆ గంజాయి మొక్కని పీకేయడం తన కర్తవ్యమనీ చెప్పుకున్నాడు.
బండ్లతో తిట్ల పురాణం అంటే ఇలాగే వుంటుంది మరి.
విజయ సాయి రెడ్డి విద్యాధికుడు. పైగా రాజ్యసభ సభ్యుడు. హుందాతనం కోల్పోవడం వల్ల ఆయనకే నష్టం. బండ్ల గణేష్‌కి ఇలాంటి వివాదాలు కొత్త కాదు.
బండ్ల చల్లిన బురదని విజయ సాయి రెడ్డి కడుక్కోవడానికి చాలా చాలా కష్టపడాలి. బండ్ల వెర్సస్ విజయ సాయి రెడ్డి మాటల యుద్ధంలో వైసీపీ నష్టపోయే అవకాశముంది.