జగన్ దాడి నిందితుడి గురించి డాక్టర్ చెప్పిన షాకింగ్ విషయాలు (వీడియో)

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి చేసిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును మంగళవారం సాయంత్రం ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యం బాగాలేదని పోలీసులకు తెలపడంతో కేజీహెచ్‌కు నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు తరలించారు. శ్రీనివాసరావును పోలీసులు భూజాలపై ఎత్తుకుని తీసుకువెళ్లి వ్యాన్‌లో కూర్చోబెట్టి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఉదయం నుంచి శ్రీనివాసరావు ఆహారం తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు.

ఎడమ చేయి బాగా నొప్పి వస్తుందని, ఛాతిలో దడగా ఉందని శ్రీనివాసరావు పోలీసులకు చెప్పడంతో వైద్యులకు సమాచారం అందించారు. ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి పరీక్షలు చేసిన వైద్యుల సూచనల మేరకు శ్రీనివాసరావును కేజీహెచ్‌కు తరలించారు. తన అవయవాలను దానం చేయాలంటూ నిందితుడు డాక్టర్లతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నట్టు సమాచారం. సమస్య ఏమిటీ అని అడిగితే.. నాకు వైద్యం కాదు. అవయవ దానం చేయడానికి సహకరించాలంటూ వైద్యులతో శ్రీనివాసరావు చెప్పినట్టు తెలుస్తోంది. బీపీ, పల్స్‌ రేట్లు నార్మల్‌గానే ఉన్నాయని వైద్యులు చెప్పారు.

నిందితుడు శ్రీనివాస్ ని పరీక్షించిన కెజిహెచ్ వైద్యులు, అతడు గుండెపోటుతో బాధ పడుతున్నట్లు చెబుతున్నారు. వైద్యానికి సహకరించట్లేదని డాక్టర్ దేముడు మీడియాతో తెలిపారు. తనకు ట్రీట్మెంట్ వద్దని, అవయవదానం చేస్తానంటున్నాడని వెల్లడించారు. అంతేకాదు నేను ప్రజలతో మాట్లాడాలి అని గట్టిగ కేకలు పెడుతున్నట్టు వైద్యులు తెలిపారు.

డాక్టర్లు చెబుతున్న మాటలు ఇలా ఉంటే…హాస్పిటల్ కి తరలిస్తున్న సమయంలో నిందితుడు శ్రీనివాస్ నాకు ప్రాణహాని ఉంది సర్ అంటూ పోలీసులను పదే పదే విన్నవించడం మరో ట్విస్టు. అవయవాలు దానం చేయమని శ్రీనివాస్ డాక్టర్లతో చెప్పినట్టయితే…హాస్పిటల్ కి వెళ్లేముందు ప్రాణహాని ఉందంటూ ఎందుకు పోలీసులకు చెప్పాడంటూ వైసీపీ శ్రేణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో కింద ఉంది చూడండి.