ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడానికి జగన్ పడిన కష్టం అంతాఇంతా కాదు. 2014లోనే వైసీపీ అధికారంలోకి రావాల్సి ఉన్నా జగన్ పై ప్రజల్లో పూర్తిస్థాయిలో నమ్మకం లేకపోవడం, టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం ఎన్నికల ఫలితాలపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపాయి. టీడీపీ ఏపీలో అధికారంలోకి వచ్చినా ఎన్నికల ముందు ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయడంలో పూర్తిస్థాయిలో ఫెయిలైంది.
అదే సమయంలో అమరావతికి సమీపంలోని భూములను టీడీపీ నేతలు, టీడీపీ సన్నిహితులు కొనుగోలు చేశారని సోషల్ మీడియా, వెబ్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి షర్మిల కూడా తన వంతు కష్టపడ్డారనే సంగతి తెలిసిందే. అయితే ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్, షర్మిల మధ్య గ్యాప్ అంతకంతకూ పెరుగుతోంది.
నేడు రాఖీ పండుగ కాగా షర్మిల జగన్ కు రాఖీ కట్టకపోవడం గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఆస్తుల వల్లే జగన్, షర్మిల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని గతంలో వార్తలు వైరల్ అయ్యాయి. అన్నాచెల్లెళ్ల మధ్య బేధాభిప్రాయాలు లేవని విజయమ్మ ఎన్నిసార్లు చెబుతున్నా వైసీపీ నేతలు సైతం ఆమె చెబుతున్నా విషయాలను నమ్మడం లేదు. ప్రస్తుతం షర్మిల వికారాబాద్ లో పాదయాత్ర చేస్తున్నారు.
రాఖీ పండుగ రోజున కూడా షర్మిల సోదరుడు ఏపీ సీఎం జగన్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం గమనార్హం. జగన్ షర్మిల కలిసికట్టుగా ఉంటే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్టీపీ పార్టీ ద్వారా తెలంగాణలో షర్మిల అధికారంలోకి రావాలని భావిస్తున్నా ప్రముఖ పార్టీల నేతలు, ప్రజలు షర్మిలను నమ్మడం లేదు. జగన్ సపోర్ట్ ఉంటే షర్మిలకు తెలంగాణలో కూడా అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది.