జగన్-చంద్రబాబుకు ఇదే తేడా ?

జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబునాయుడుకు ఉన్న తేడా స్పష్టంగా అందరికీ అర్ధమవుతోంది. తనకు ప్రభుత్వం భద్రతను కుదించిందంటూ స్వయంగా చంద్రబాబే హై కోర్టులో కేసు వేశారు. చంద్రబాబు కేసు వేసినా ఈ విషయంలో టిడిపి నేతలు ఇంకా ఎందుకనో యాగి  మొదలుపెట్టలేదు.

సరే వాళ్ళు చేసే యాగిని పక్కనపెడితే చంద్రబాబు మరచిపోయిన విషయం ఇక్కడొకటుంది. ప్రస్తుతం చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి. సిఎంకు మాజీ సిఎంకు మధ్య తేడాను 40 ఇయర్స్ ఇండస్ట్రీ మరచిపోయినట్లున్నారు.  సిఎంగా ఉన్నపుడు అనుభవించిన సౌకర్యాలు, భద్రత లాంటివి పదవిలో నుండి దిగిపోయిన తర్వాత ఉండదు.

తాను మాజీ అయినా సరే వాటన్నింటినీ యధాతధంగా కొనసాగించాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. ఇక్కడే చంద్రబాబుతో సమస్య వస్తోంది. ఆల్రెడీ ఎస్పీజీ భద్రతా వలయంలో ఉన్న చంద్రబాబుకు ఆ భద్రత ఎలాగూ ఉంటుంది. కాకపోతే చంద్రబాబు మాజీ అయిపోయారు కాబట్టి రాష్ట్ర పోలసులకు సంబంధించిన భద్రత మాత్రం కాస్త తగ్గుతుందంతే. ఇంతమాత్రానికే భద్రత విషయంలో చంద్రబాబు కోర్టుకెక్కారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. నిజంగా అప్పట్లో జగన్ కు ఉండాల్సినంత భద్రతు ఉండుంటే  ఆ ఘటన జరిగేదే కాదు. హత్యాయత్నం ఘటన విషయమై భద్రతా లోపాలపై డియాతో ప్రశ్నిస్తే ఆ బాధ్యత తమది కాదని చంద్రబాబు చేతులు దులిపేసుకున్నారు. కనీసం భద్రత పెంచుతామని కూడా చెప్పటానికి నోరు రాలేదు.  మరి అప్పట్లో జగన్ భద్రత విషయంలో నోరు కూడా విప్పలేదే. ఇక్కడే జగన్-చంద్రబాబు మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది.