ఢిల్లీ టైమ్స్.! టీడీపీపై మారిన జనసేనాని పవన్ కళ్యాణ్ స్వరం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వరం మారింది. ‘ఏదిఏమైనా, పొత్తులతోనే ముందుకు వెళతాం..’ అని ఇప్పటిదాకా చెప్పిన జనసేనాని, ఆ పొత్తుల్లో ప్రధానమైన తెలుగుదేశం పార్టీని లైట్ తీసుకున్నారు. అదీ ఢిల్లీ పర్యటన సందర్భంగా.

ఢిల్లీలో జరుగుతున్న ఎన్టీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి హాజరయ్యేందుకోసం పార్టీ ముఖ్య నాదెండ్ల మనోహర్‌తో కలిసి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా, నేషనల్ మీడియాతో జనసేనాని మాట్లాడారు.

‘మేం ప్రస్తుతానికి బీజేపీతోనే పొత్తులో వున్నాం. బీజేపీతోనే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం. బీజేపీతోనే తొలుత స్నేహం మొదలైంది. ఆ బీజేపీతోనే ఇప్పుడు వున్నాం. మాతో కలిసి రావాలా.? వద్దా.? అన్నదానిపై టీడీపీనే తేల్చుకోవాలి..’ అనేశారు జనసేనాని.

ఇదెక్కడి పంచాయితీ.? ‘పవన్ కళ్యాణ్ ఇలా మాట మార్చడం పద్ధతిగా లేదు..’ అంటూ తెలుగు తమ్ముళ్ళు గుస్సా అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ మీద మండిపడుతున్నారు టీడీపీ శ్రేణులు.

‘జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగానే వున్నాం. అయితే, బీజేపీ మాత్రం.. టీడీపీతో కలిసేందుకు సిద్ధంగా లేదు. అందుకే టీడీపీ – జనసేన మాత్రమే కలిసి ముందుకు వెళతాయి..’ అన్నది టీడీపీ నేతల ఉవాచ.

ఎవరి గోల వారిదే.! ‘మాతో వస్తే రండి.. లేకపోతే మీ ఇష్టం..’ అని టీడీపీకి పవన్ కళ్యాణ్ తెగేసి చెప్పేయడం.. కొత్త అనుమానాలకు తావిస్తోంది. తమ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్‌ని బీజేపీ ప్రకటించనుందన్న ప్రచారం నేపథ్యంలో