కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ పెద్దలు ఈమధ్యకాలంలో ఎప్పుడూ లేనంత టెన్షన్ పడుతున్నారని తెలుస్తుంది. చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న విపక్షాలు ఆ ఎన్నికల ఫలితాల అనంతరం ఐక్యతా రాగం వినిపించడం మొదలుపెట్టాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈసారి బీజేపీని కొట్టొచ్చనే మనోధైర్యానికి వచ్చేశాయి. ఈ సమయంలో బీజేపీ అధిష్టాణం పెద్దలు కొత్త కొత్త స్కెచ్చులు వేస్తున్నారని తెలుస్తుంది.
అవును… కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీకి కొత్త టెన్షన్ పట్టుకుందని తెలుస్తుంది. బీజేపీకి దక్షిణాదిలో దారులు మూసుకుపోతున్నాయనే కామెంట్లు వినిపిస్తోన్న తరుణంలో… తెలంగాణ, తమిళనాడు, ఏపీ రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. తమిళనాడులో పరిస్థితులు ఎంత అనుకూలంగా ఉన్నాయన్న సంగతి కాసేపు పక్కనపెడితే… తెలంగాణలో కాస్తో కూస్తో హోప్ కనిపిస్తుందని నిన్నటివరకూ కథనాలొచ్చేవి.
ఇక మిగిలింది ఆంధ్రప్రదేశ్. ఇక్కడ బీజేపీకి నోటాతో పోటీ పడుతుంటుంది. అయితే ఈ సమయంలో జనసేన ను నమ్ముకుని రాజకీయం చేయాలని ఫిక్సయ్యింది. అయితే ఏపీలో ఇప్పటికిప్పుడు అధికారంలోకి రావాలనేది బీజేపీ లక్ష్యం కాదు అనేది స్పష్టం! వారి ప్రధాన లక్ష్యమెళ్లా… ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయంగా తాము ఎదగాలని. అందుకు అడ్డుగా ఉన్నది టీడీపీ మాత్రమే!
దీంతో ఇప్ప్డు బీజేపీ తాను ఫ్యూచర్ లో ఎదగాలి, నిలబడాలి అంటే ఇప్పుడు వారిముందున్న తక్షణ కర్తవ్యం టీడీపీని చావు దెబ్బ కొట్టడం. 2019 ఎన్నికల్లో జగన్ దెబ్బకు టీడీపీ వెంటిలేటర్ పై ఉన్నట్లు అనిపిస్తున్నా… గడిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం కాస్త చేతులు, కాళ్లూ కదిలిస్తున్నట్లు తెలుస్తుంది. అది కూడా జనసేన అనే మెడిసిన్ దానికి బాగా పనిచేస్తుందని వారు భావిస్తున్నారు.
దీంతో ఈ దఫా వెంటిలేటర్ పై ఉన్న టీడీపీకి జనసేన అనే సెలైన్ వైర్ కట్ చేసేస్తే… రాబోయే రోజుల్లో అధికార వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అవుతామని భావిస్తున్నారు. ఇందులో భాగంగా కమ్మ – కాపు సూత్రాన్ని ఫాలో అవ్వాలని ఫిక్సయినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే పురందేశ్వరి కి ఏపీ పగ్గాలు అప్పగించడంతోపాటు.. పవన్ ను వదిలే ప్రసక్తి లేదని అధిక ప్రాధాన్యత ఇస్తుంది.
ఈ సమయంలో పురందేశ్వరి డ్యూటీ స్టార్ట్ చేశారని తెలుస్తుంది. ఇందులో భాగంగా చంద్రబాబు రహిత టీడీపీని కోరుకునే వారికి… ఎన్ టీఆర్ ని ఇష్టపడుతూ చంద్రబాబుతో బలవంతపు కాపురం చేస్తున్నవారికి టచ్ లోకి వెళ్తున్నారని అంటున్నారు. అవును… టీడీపీలో ఉంటే చంద్రబాబుని నిత్యం మనసులో ధ్వేషించుకునే కమ్మ సామాజికవర్గ నేతలకు పురందేశ్వరి టచ్ లోకి వెళ్తున్నారని తెలుస్తోంది!
ప్రస్తుతానికి పేర్ల వివరాలు తెలియనప్పటికీ… జరుగుతున్నది ఇదే అని అంటున్నారు. ఇదే సమయంలో త్వరలో పవన్ తో కూడా భేటీ అయ్యి భవిష్యత్ కార్యచరణను ప్రకటించబోతున్నారన్ని తెలుస్తోంది. ఈ వ్యవహారం చంద్రబాబుకు తెగ చికాకు తెప్పిస్తుందని అంటున్నారని అంటున్నారు. ఇప్పుడిప్పుడే ఏదో కోలుకుంటున్నట్లు అనిపిస్తున్న తరుణంలో… 2019 లో తగిలిన దెబ్బలు ఇప్పుడిప్పుడే మానుతున్నాయని నమ్మకం కలుగుతున్న దశలో మళ్లీ ఇదేమి పంచాయతీ అని బాబు తలపట్టుకుంటున్నారని సమాచారం.
మరి నిజంగా పురందేశ్వరి ఆ స్థాయిలో వేగంగా పావులు కదుపుతున్నారా.. హస్తినలోని బీజేపీ పెద్దలు ఆశిస్తున్నట్లుగా కమ్మ – కాపు ఈక్వేషన్స్ లో భాగంగా కమ్మ ల చేరిక ఆమె తీసుకుని, కాపుల చేరిక బాధ్యత పవన్ కు అప్పగిస్తున్నారా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా… చంద్రబాబు మాత్రం అష్టదిగ్భందనంలో ఉన్నారని అంటున్నారు పరిశీలకులు.