ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారనే సంగతి తెలిసిందే. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులందరికీ పథకాలు అందేలా జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జగన్ ఇప్పటికే అర్హులెవరికీ పథకాలను కట్ చేయడం లేదని చెబుతున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు పెట్టుకుని జగన్ అలాంటి రిస్క్ చేసే అవకాశాలు కూడా లేవనే సంగతి తెలిసిందే.
అయితే జగన్ సర్కార్ మాత్రం ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగా ఇలాంటి రిస్క్ లు చేసే అవకాశం అయితే ఉండదని మరి కొందరు చెబుతున్నారు. జగన్ వాస్తవాలు చెబుతున్నా కొంతమందికి అర్థం కావడం లేదని అందుకే ఈ తరహా వార్తలను ప్రచారంలోకి తెస్తున్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సంక్షేమ పథకాల కోసం జగన్ పెన్షన్లు కట్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే అర్హత ఉండి ఏ కారణం చేతనైనా పెన్షన్ రాకపోయినా వాళ్లకు పెన్షన్ అందే విధంగా జగన్ సర్కార్ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ మొదట నోటీసులు ఇచ్చి వాళ్ల పెన్షన్ ను ఏ కారణం వల్ల కట్ చేస్తున్నారనే సమాచారం కూడా ఇస్తోంది. అర్హత లేని వాళ్లకు పెన్షన్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏంటనే ప్రశ్నలు సైతం సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.
జగన్ సర్కార్ ఆర్థిక భారం తగ్గించుకోవాలని భావిస్తే మాత్రం ఎక్కువ సంఖ్యలో కట్ చేసేదని అర్హత లేనివాళ్లకు మాత్రమే కట్ చేయాల్సిన అవసరం లేదని మరి కొందరు చెబుతున్నారు. చంద్రబాబు నిరుద్యోగ భృతి స్కీమ్ ను ఏ స్థాయిలో అమలు చేశారో గుర్తుంచుకోవాలని ఆరునెలలు ఈ స్కీమ్ ను అమలు చేయగా ఈ స్కీమ్ ద్వారా చాలా తక్కువ సంఖ్యలో నిరుద్యోగులు మాత్రమే బెనిఫిట్ పొందారు.