కమలం కంచుకోటలో పాగా వేసిన సీపీఎం

రాజస్థాన్ బిజెపి కి కంచుకోటగా ఉంది. ఆ కంచుకోటలో కాంగ్రెస్ అత్యధిక సీట్లతో గెలుపు సాధించింది. రాజస్థాన్ లో బిజెపి, కాంగ్రెస్ కంచుకోటలను బద్దలు కొడుతూ సిపిఎం ఒక స్థానంలో విజయం సాధించగా మరో స్థానంలో లీడింగ్ లో ఉంది.

రాజస్థాన్ భద్ర నియోజకవర్గల్లో సిపిఎం అభ్యర్ది ఘన విజయం సాధించారు. భద్ర నియోజకవర్గంలో బల్వాన్ పునియా విజయం సాధించారు. కమలం కంచుకోటలో ఎర్రజెండా పాగా వేసింది. దోడ్ నియోజకవర్గంలో పేమ రామ్ సిపిఎం అభ్యర్ది లీడింగ్ లో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఆయన గెలిచే అవకాశం కన్పిస్తోంది.

పేమరామ్ మరియు బల్వాన్ పునియా ఇద్దరు కూడా సీపీఎంలో కీలక పాత్ర పోషించారు. విద్యార్ది దశ నుంచి వారు పార్టీలో కొనసాగారు. విద్యార్దుల సమస్యలు, రైతుల సమస్యల పై వారు అనేక పోరాటాలు చేశారు. వారి పోరాటాల ఫలితంగానే వారి గెలుపు సాధ్యమయిందని సీపీఎం నేతలు ఆనందం వ్యక్తం చేశారు.